బాలయ్య రెమ్యూనరేషన్ 10 కోట్లు.. నమ్మొచ్చా?

0

ఒక హీరో లేదా డైరెక్టర్ రెమ్యూనరేషన్ ఎప్పుడు వారి సినిమాలు చేసే బిజినెస్ పైనే ఆధారపడి ఉంటుంది. అరుదైన సందర్భాలలతో తప్ప ఎప్పుడూ నిర్మాతలు హీరో మార్కెట్ ను మించి రెమ్యూనరేషన్ ఇవ్వరు. అయితే తాజాగా నటసింహ నందమూరి బాలకృష్ణ తన కొత్త సినిమాకు తీసుకునే రెమ్యూనరేషన్ విషయంలో వినిపిస్తున్న టాక్ అందరికీ షాక్ ఇస్తోంది.

బాలకృష్ణ ప్రస్తుతం కె యస్ రవికుమార్ దర్శకత్వంలో ‘రూలర్’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను సీ. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు బాలయ్య రెమ్యూనరేషన్ గా రూ.10 కోట్లు చెల్లించారనే టాక్ వినిపిస్తోంది. నిజానికి బాలయ్య రెమ్యూనరేషన్ నాలుగు నుంచి ఐదు కోట్ల రేంజ్ లో తీసుకుంటారు. ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ లాంటి సినిమా కాకుండా బాలయ్య నటించే రెగ్యులర్ కమర్షియల్ సినిమాల మార్కెట్ 25 కోట్ల లోపే ఉంటుంది. అలాంటిది ‘రూలర్’ సినిమాకి బాలయ్యకు పది కోట్లు రెమ్యూనరేషన్ అనేది నమ్మశక్యంగా లేదని ఇన్సైడ్ టాక్. బాలయ్య లాస్ట్ సినిమాలు ‘ఎన్టీఆర్ కథానాయకుడు’.. ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే. ఆ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయి ఉంటే ఈ రెమ్యూనరేషన్ హైక్ మాటకు వెయిటేజ్ ఉండేది కానీ ఇప్పుడు మాత్రం దీన్ని జస్ట్ ఓ రూమర్ గానే పరిగణిస్తున్నారు.

చివరి దశ షూటింగ్ లో ఉన్న ‘రూలర్’ ను డిసెంబర్ 20 న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే కొత్త గెటప్ తో..ఐరన్ మ్యాన్ స్టైల్ గడ్డంతో అందరినీ ఆకర్షించిన బాలయ్య ఈ సినిమాలో సోనాల్ చౌహాన్.. వేదికలతో రోమాన్స్ చేస్తున్నారు. బాలయ్య – కె యస్ రవికుమార్ కాంబినేషన్ లో గతంలో తెరకెక్కిన ‘జైసింహా’ హిట్ కావడంతో ఈ సినిమాకూడా విజయం సాధించడం ఖాయమని నందమూరి అభిమానులు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.