బాలయ్య వారసుడు.. అది సంగతి

0

నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎంతో కాలం నుంచి చర్చలు సాగుతున్నాయి. నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. అభిమానులకు సంతోషం కలిగేలా బాలయ్య ఈమధ్యే మోక్షజ్ఞను అమెరికాకు పంపారని.. అక్కడ ఫిలిం ఇన్ స్టిట్యూట్ లో చేర్పించారని వార్తలు వచ్చాయి.

తాజా సమాచారం ప్రకారం మోక్షజ్ఞకు యాక్టింగ్ లో మెళకువలు నేర్పించేందుకు అమెరికా లోని ప్రఖ్యాత లీ స్ట్రాస్ బర్గ్ ఫిలిం అండ్ థియేటర్ ఇన్ స్టిట్యూట్ లో చేర్పించారట. ఇక్కడ మోక్షజ్ఞ నటనలో భిన్నరీతులపై శిక్షణ తీసుకుంటాడని సమాచారం. ఇక్కడ యాక్టింగ్ కోర్సు పూర్తి కాగానే మోక్షజ్ఞ ఇండియాకు తిరిగి వస్తాడని.. ఎక్కువ గ్యాప్ లేకుండా మోక్షజ్ఞ డెబ్యూ సినిమాను అధికారికంగా లాంచ్ చేస్తారని అంటున్నారు.

మోక్షజ్ఞ డెబ్యూ సినిమా దర్శకత్వ బాధ్యతలను బాలయ్య బోయపాటి శ్రీనుకు అప్పగించారట. మోక్షజ్ఞకు సినీరంగ పరిచయానికి తగిన కథను బోయపాటి రెడీ చేయడం కూడా మొదలు పెట్టారని అంటున్నారు. బోయపాటి ప్రస్తుతం బాలయ్య సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-