బాలయ్యకు విజిల్స్ కేకలు

0

నిన్న విడుదలైన లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫైనల్ స్టేటస్ ఏంటి అనేది తేలడానికి ఇంకో రెండు మూడు రోజులు పడుతుంది కానీ సినిమా తాలూకు విశేషాలు మాత్రం సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో విడుదల కాకపోవడంతో వీటి తాలూకు వీడియో క్లిప్పింగ్స్ ని షేర్ చేస్తున్న ఇతర ప్రాంతాల ద్వారా అందులోని సన్నివేశాలను బాగానే ఎంజాయ్ చేస్తున్నారు.

ఇదిలా ఉండగా సినిమాలో కీలక పాత్రలకు పేర్లను నేరుగా ప్రస్తావించలేకపోయినా ఇన్ డైరెక్ట్ గా అవి ఎవరివో శారీరక బాష మిమిక్రి చేసిన గొంతు ద్వారా ఈజీగా గెస్ చేసే అవకాశం ఇచ్చిన వర్మ మొత్తానికి సాహసమే చేశాడు. ఎన్టీఆర్ సంతానంలో ఒకే ఒక్క నట వారసుడిగా పేరున్న నందమూరి బాలకృష్ణ పాత్రకు ఇచ్చిన సన్నివేశాలు తక్కువే అయినా థియేటర్లలో ఈలలు గోలతో కాసేపు మోత మోగడం విశేషం

నిజానికి ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడులో కూడా ఇంత రెస్పాన్స్ రాలేదు కానీ ఇందులో బాలయ్య పాత్రధారి చెప్పే ఒకటి రెండు డైలాగులకు స్పందన కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు పాత్ర ఏం చేసినా దానికి మద్దతు ఇవ్వడం తప్ప అంతకు మించి స్పాన్ వర్మ రాసుకోలేదు. అయినా కూడా సదరు యాక్టర్ ని కాస్త ఒడ్డు పొడుగు ఉన్న వాడినే తీసుకోవడంతో త్వరగా కనెక్ట్ అయ్యే అవకాశం దక్కింది. అసలు టైటిల్ కార్డులో మొదట థాంక్స్ టు బాలకృష్ణ అని వేసినప్పుడే వర్మ ఉద్దేశం మరోసారి అర్థమయ్యింది. ఇది బాలయ్య ఫాన్స్ ని కవ్వించే చర్యే అయినప్పటికీ వర్మ అనుకున్నదే చేశాడు