నారీ నారీ నడుమ బాలయ్య

0

నటసింహ నందమూరి బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్ అంటే అంచనాలు ఎలా ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. సింహ- లెజెండ్ భారీ విజయం సాధించడంతో ఆ కాంబో అంటేనే ప్రత్యేకమైన క్రేజ్. ఆ క్రేజ్ కి మరో కారణం కూడా ఉంది. ఈ రెండు సినిమాల్లో బాలయ్య ఇద్దరు భామలతో రొమాన్స్ చేస్తాడు. సింహాలో నయనతార-స్నేహా ఉల్లాల్.. లెజెండ్ లో రాధికా ఆప్టే- సోనాల్ చౌహాన్ ల మధ్య బాలయ్య ముద్దుల ప్రియుడుగా నటించారు. అదే సెంటిమెంట్ ను జై సింహాలోనూ రిపీట్ చేసాడు. నయనతార- నటాషా దోషి.. అలాగే హరిప్రియలతో రొమాన్స్ చేశాడు. తాజాగా బోయపాటి మరోసారి అదే మ్యాజిక్ ని రిపీట్ చేయబోతున్నాడని సమాచారం.

దీనిలో భాగంగా ఈసారి ఓ సీనియర్ హీరోయిన్ ని- మరో కొత్త భామని బరిలోకి దింపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. నటీనటుల ఎంపిక జరుగుతోంది. మరోసారి తెర బోయపాటి స్టైల్లో రంగుల మయం కానుందని సమాచారం. ఈ నేపథ్యంలోనే బోయపాటి సన్నిహిత వర్గాల నుంచి ఇద్దరు భామల రొమాన్స్ సంగతి లీకైంది. ప్రస్తుతం బాలయ్య కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూలర్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అన్ని పనులు పూర్తిచేసి డిసెంబర్ లో సినిమా రిలీజ్ చేయనున్నారు.

ఇక బోయపాటి అదే నెల 20న బాలయ్య సినిమా పట్టాలెక్కించనున్నాడు. వినయ విధేయ రామ పరాజయం నేపథ్యంలో బాలయ్య తో విజయం అందుకుని రేసులోకి రావాలని చూస్తున్నాడు. ప్లాప్ ముద్రని వీలైనంత త్వరగా చెరుపుకోవాలని కసి మీదున్నాడు. బాలయ్యతో సక్సెస్ లు తప్ప! పరాభవాలు లేని నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ పై కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. ఈ చిత్రాన్ని ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు.




Please Read Disclaimer