బాలయ్య మాట్లాడితే కాలర్ ట్యూనే!

0

బాలయ్య మాట్లాడితే కాలర్ ట్యూన్ కావాల్సిందే! ఈ మాట అన్నది ఎవరో తెలుసా? తనదైన వాక్చాతుర్యంతో ఆడియో ఈవెంట్ ని దడదడలాడించే యాంకర్ ఉదయభాను. నటసింహాని పొగిడేయబోయి నాలుక్కరుచుకుంది పాపం! ఇకపోతే రూలర్ ప్రీరిలీజ్ వేడుక నేటి సాయంత్రం విశాఖ ఉడాపార్క్ సమీపంలో ఎంజీఎం గ్రౌండ్స్ లో అత్యంత భారీగా బాలయ్య అభిమానుల నడుమ సాగుతోంది.

ఈ వేదిక వద్ద విశాఖ నుంచి పొంగుకొచ్చిన అశేష అభిమానుల్ని ఆకట్టుకునేందుకు ఉదయభాను ఎంతో హుషారుగా ప్రిపేరై విచ్చేసింది. అయితే చాలా గ్యాప్ తర్వాత ఉదయభాను రీఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే బుల్లితెర రియాలిటీ షోలతో బిజీ అవుతోంది. పెళ్లాడి మామ్ అయ్యాక.. ఇటీవల పర్సనల్ లైఫ్ లో బిజీ అయిపోయిన భానుకి ఈ గ్యాప్ కొంత ఇబ్బందికరంగానే మారింది. అది కాస్తా తడబాటుగా మారింది. బాలయ్య మాట్లాడితే కాలర్ ట్యూనే! అంటూ పరేషాన్ చేసిందంతే!

వేదికపై బాలయ్యను పొగడ్తల్లో ముంచెత్తబోయి ఎందుకనో ఈ సీనియర్ యాంకర్ కాస్తంత తడబడింది. నటసింహా ఒక విషయంలో వెనకబడుతున్నారు! అంటూ కామెంట్ చేసి షాకిచ్చిన భాను.. “వయసు విషయంలో వెనక్కి వెళుతున్నారు“ అంటూ మరో షాకిచ్చింది. “ఇంకా వెనక్కి వెళుతున్నారు.. దేవ లోకం నుంచి అమృతం ఏదైనా పార్సిల్ చేశారేమో!“ ఆ అమృతం సీక్రెట్స్ ఏమిటో మాక్కూడా చెప్పండి..!!అంటూ బాలయ్యనే అడిగేయడంతో ఫ్యాన్స్ ఒకటే కేరింతలు కొట్టారు. అసలే బాలయ్య ఏజ్ గురించి విస్త్రతంగా చర్చ సాగుతున్న వేళ ఏది అడక్కూడదో అదే అడిగేసింది భాను. అయితే ఫ్యాన్స్ లో ఉదయభానుకు ఏమాత్రం ఇమేజ్ తగ్గలేదని విశాఖ ఈవెంట్లో ప్రూవైంది.
Please Read Disclaimer