బాలయ్య వాడిన బూతు ఏమై ఉంటుందబ్బా??

0

చాలామందికి వాళ్లు చేసే పని పట్ల ఆసక్తి ఉండదు.. ఎక్కువ స్టూడెంట్స్ కు చదువు పట్ల ఇంట్రెస్ట్ ఉండదు.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టులో చాలానే ఉంటాయి. అయితే మనకి ఆసక్తి కలిగించే అంశాలు చాలానే ఉన్నాయి. ఉదాహరణకు బాలయ్య బాబు ఫైర్ కావడం. ఆయనకు ప్రేమ ఎక్కువే.. కాస్త కోపం కూడా ఎక్కువ. కోపం రానంతవరకూ ఎంతో శాంతంగా ఉంటారు కానీ కోపం వస్తే మాత్రం అభిమానుల చెంపలు పగిలిపోతాయి.. బూతుల దెబ్బకు జనాల చెవులు పగిలిపోతాయి.

పాపం జనాల చెవుల ఆరోగ్యాన్ని కాపాడే సదుద్దేశంతో నిన్నటి బాలయ్య ఫైర్ ఫైర్స్ ది ఫైర్ వీడియోను ఒక్క చోట స్వీయ సెన్సారింగ్ చేసి టీవీలలో ప్రసారం చేశారు. దీంతో మన నెటిజన్ల ఆసక్తి రెట్టింపయింది. అసలా బూతు ఏంటి? అందులో ఎంత ఫోర్స్ ఉండకపోతే బీప్ చేస్తారు అంటూ నెటిజెన్లు ఒరిజినల్ అన్-ఎడిట్ వీడియో కోసం వెతకడం మొదలు పెట్టారు. పాపం.. అది ఇంకా దొరకలేదు. ఆ బూతు ఏంటనేది కనుక్కోవడంలో ఘోరంగా ఫ్లాప్ అయ్యారు.

దీంతో ఆ బూతు ఏంటని ఊహాగానాలు మొదలయాయి. ఒకరు ఆ బూతు అంటే ఒకరు ఈ బూతు అన్నారు.. మరొకరు ఇవి జుజుబి బాతులు వీటి తాతలాంటి బూతు అది అంటూ ఓ పెద్ద బండ బూతు చెప్పారు. ఇక్కడ ఆ బూతు పురాణం చెప్పలేకనే ఆ బూతు ఈ బూతు ఊ బూతు ఎ ఎ ఐ బూతు అంటూ అక్షరమాలలోని అచ్చులను వాడాల్సి వస్తోంది. ఏదేమైనా విమర్శలు.. అంశాలు ఇలాంటివి అన్నీ పక్కకుపోయి ఆ బూతును పట్టుకుని అందరూ వేలాడడం ఆశ్చర్యమే!
Please Read Disclaimer