ఆ ముగ్గురికి అది సాధ్యం కాదేమో?

0

సైరా బాక్స్ ఆఫీస్ పెర్ఫార్మన్స్ బయట ఎలా ఉన్నప్పటికీ తెలుగులో వంద కోట్ల షేర్ దాటేసి బాహుబలి సిరీస్ తర్వాత స్థానాన్ని కొట్టేసి మరోసారి మెగాస్టార్ స్టామినాని రుజువు చేసింది. ఒకవేళ యునివర్సల్ హిట్ అయ్యుంటే టాప్ వన్ కో టూకో ఎసరు పెట్టేదే కాని ఆ ఛాన్స్ మాత్రం మిస్ చేసుకుంది. ఎనిమిదేళ్ళ గ్యాప్ తర్వాత వచ్చినా చిరుకు ఈ రేంజ్ బాక్స్ ఆఫీస్ రికార్డులు దక్కడం ఎంతైనా విశేషమే. కాని ఒకప్పుడు తనతో సమకాలీకులుగా ఉన్న మిగిలిన ముగ్గురు సీనియర్ హీరోలు ఈ వంద కోట్ల ఫీటు అందుకోగాలరా అంటే సమాధానం చాలా కష్టమని చెప్పక తప్పదు.

బాలయ్య మార్కెట్ ఇప్పటికీ 50 కోట్లు అందుకోవడానికే నానా తంటాలు పడుతోంది. విపరీతమైన హైప్ వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ ఫలితం తర్వాత ఎక్కువ పెట్టుబడిని రిస్క్ గా ఫీలవుతున్నారు బయ్యర్లు. ఇక నాగార్జున పరిస్థితి సరేసరి. ఆఫీసర్ నుంచి మన్మధుడు 2 దాకా ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఒకరకంగా వెంకటేష్ బెటర్. ఎఫ్2తో మరోసారి తన సత్తా చాటారు. వంద కోట్లు అందుకోలేకపోయినా స్ట్రాంగ్ కంటెంట్ పడితే తనలో ఆ పవర్ ఉందని రుజువు చేశారు. కాని అదంతా సులభం అయితే కాదు.

ఈ లెక్కన చిరు సెట్ చేసిన బెంచ్ మార్క్ ని మహేష్ ప్రభాస్ చరణ్ బన్నీ తారక్ లాంటి రైజింగ్ స్టార్స్ అందుకోగలరు కాని సీనియర్లకు మాత్రం ఈ అందని ద్రాక్ష అంత సులభంగా చిక్కేలా లేదు. సైరా దసరా పండగ తర్వాత బాగా నెమ్మదించిన నేపధ్యంలో వీకెండ్ తప్ప మిగిలిన రోజుల మీద ఆశలు పెట్టుకోకపోవడం ఉత్తమం. ఫైనల్ రన్ ఎప్పుడు వస్తుందో బయ్యర్లకు సైతం అర్థం కావడం లేదు. ఇంకో రెండు వారాలు గ్యారెంటీ అనే మాట అయితే వినిపిస్తోంది. చూద్దాం.Please Read Disclaimer