బాలయ్య విగ్గులు.. సెట్ కాలేదంటున్నారే!

0

నటసింహ నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా ‘రూలర్’ టీజర్ గురువారం సాయత్రం విడుదలయింది. అభిమానులు బాలయ్య నుండి ఏ అంశాలు ఆశిస్తారో వాటిని పూర్తిగా మేళవించి వండిన పక్కా కమర్షియల్ వంటకంలా కనిపిస్తోంది. ఫైట్స్.. డ్యాన్స్.. పంచ్ డైలాగ్స్.. ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్.. ఇలా అన్నీ ఉన్నాయి. ఇక బాలయ్య విభిన్న గెటప్స్ కూడా అందరినీ ఆకర్షిస్తున్నాయి.

అయితే ఈ విగ్గులు బాలయ్యకు పెద్దగా సెట్ కాలేదని కూడా సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. టీజర్లో బాలయ్య రెండు రకాల గెటప్స్ లో కనిపించారు. ఒక గెటప్ లో పొడవాటి జుట్టు.. మధ్య పాపిడి.. గడ్డంతో పోలీస్ ఆఫీసర్ గా చెలరేగిపోయారు. బాలయ్య నటనకు ఎవ్వరూ వంకలు పెట్టలేరు కానీ ఆ విగ్.. ఆ హెయిర్ స్టైల్ బాలయ్య బాబుకు సూట్ కాలేదని వ్యాఖ్యలు వినిపిపిస్తున్నాయి. ఈ గెటప్ లోనే రెండు వేరియేషన్లు ఉన్నాయి. ఒకటేమో ఫుల్ బ్లాక్ గడ్డంతో యంగ్ లుక్ కాగా మరో సీన్లో కాస్త నెరిసిన జుట్టుతో కనిపిస్తున్నారు. ఇక మరో గెటప్ లో బాలయ్య టోనీ స్టార్క్ తరహాలో గడ్డంతో మీడియంగా ఉండే జుట్టుతో కనిపించారు. ఈ విగ్ కూడా పెద్దగా బాలయ్యకు పెద్దగా సూట్ లేదని అంటున్నారు. ఇది జస్ట్ టీజరే కాబట్టి సినిమాలో బాలయ్య గెటప్స్ ఎలా ఉంటాయో చూడాలి.

ఈ సినిమాలో బాలయ్య సరసన సోనాల్ చౌహాన్.. వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్.. భూమిక ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. చిరంతన్ భట్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ సినిమాను హ్యాపీ మూవీస్ బ్యానర్ పై సీ. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ‘జైసింహా’ లాంటి హిట్ తర్వాత బాలయ్య-కెయస్ రవికుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధిస్తుందనే అంచనాలు ఉన్నాయి.
Please Read Disclaimer