రవితేజ టైటిల్ హైజాక్ పై బాలయ్య ఫ్యాన్స్ మండిపాటు

0

రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో ఇటీవలే ప్రారంభం అయిన సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన విషయం తెల్సిందే. ఈ సినిమాకు ఎమ్మార్వో లేదా మరోటి అంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో ఎవరు ఊహించని విధంగా రామరావు ఆన్ డ్యూటీ అంటూ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా చిత్రీకరణ మొదలైనప్పటి నుండే అంచనాలు భారీగా ఉన్నాయి. కొత్త దర్శకుడు అయినా కూడా రవితేజకు సూట్ అయ్యే మంచి కథ.. మంచి కంటెంట్ ఉండే సినిమా అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతున్న నేపథ్యంలో టైటిల్ మరింతగా సినిమాపై ఆసక్తిని పెంచే విధంగా ఉందంటూ రెస్పాన్స్ దక్కింది. రవితేజ అభిమానులు ప్రస్తుతం ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా చెబుతున్నారు. ఖిలాడి సినిమా విడుదలకు సిద్దం అయినా కూడా రామరావు ఆన్ డ్యూటీ సినిమా కోసమే వెయిటింగ్ అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

అంతటి క్రేజ్ ను దక్కించుకున్న రామారావు ఆన్ డ్యూటీ సినిమా విషయంలో బాలయ్య అభిమానులు కొందరు సోషల్ మీడియా లో మండి పడుతున్నారు. చాలా రోజులుగా బాలకృష్ణ హీరోగా అనీల్ రావిపూడి రామారావు గారు అనే సినిమాను చేసేందుకు చర్చలు జరుపుతున్నారని.. త్వరలోనే ఆ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని తెలిసి కూడా రామారావు టైటిల్ ను రవితేజ హైజాక్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటున్నారు. రామారావు టైటిల్ బాలయ్య కు అనుకుంటూ ఉన్న సమయంలో రవితేజ సినిమా మేకర్స్ కాస్త అయినా చర్చించాలి కదా అంటూ నందమూరి అభిమానులు నెట్టింట హడావుడి చేస్తున్నారు.

రవితేజ మరియు శరత్ మండవ కాంబోలో రూపొందుతున్న టైటిల్ విషయంలో అనీల్ రావిపూడి రెస్పాన్స్ ఏంటీ అంటూ నందమూరి అభిమానులు ప్రశ్నిస్తున్నారు. బాలయ్య కోసం అనీల్ ఆ టైటిల్ ను ఎందుకు రిజిస్ట్రర్ చేయలేదు అంటూ కొందరు ప్రశ్నిస్తుండగా కొందరు మాత్రం టైటిల్ విషయంలో అనీల్ ఎందుకు స్టాండ్ తీసుకోలేక పోయాడు అంటూ మరి కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య కోసం అనుకున్న కథ ను ఇప్పటికి అలాగే అనీల్ రావిపూడి ఉంచాడు. ఇప్పుడు కాకున్నా కొన్నాళ్ల తర్వాత అయినా బాలయ్యతో ఆయన సినిమా చేస్తాడనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. కాని బాలయ్య కోసం టైటిల్ ను అనీల్ రావిపూడి రిజిస్ట్రర్ మాత్రం చేయించలేదు.

టైటిల్ ను రిజిస్ట్రర్ చేయించక పోవడం వల్ల ఇప్పుడు శరత్ మండవ ఆ టైటిల్ ను వాడేశాడు. బాలయ్య అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న సినిమా మొదలు కాకుండానే నిరాశ పర్చిందని కామెంట్స్ వినిపస్తున్నాయి. అనీల్ రావిపూడి కాస్త జాగ్రత్తపడి ఉంటే బాగుండేదని కొందరు అభిమానులు అంటున్నారు. ఇప్పుడు అనుకుని ఏమీ లాభం లేదు.. రామారావు ఆన్ డ్యూటీ సినిమా సక్సెస్ అవ్వాలని ఆ పేరుకు మరింతగా పాపులారిటీ రావాలని ఆశించడం తప్ప ఇప్పుడు ఏమీ చేయలేము అంటూ కొందరు నందమూరి అభిమానులు అంటున్నారు. బాలయ్య తో అనీల్ రావిపూడి సినిమా చేస్తే మరి ఏ టైటిల్ ను తీసుకుంటాడో చూడాలి.

ప్రస్తుతం ఎఫ్ 3 సినిమా ను చేస్తున్న అనీల్ రావిపూడి ఆ తర్వాత బాలయ్య తో ఒక సినిమాను చేసేందుకు సిద్దం అవుతాడనే వార్తలు వస్తున్నాయి. భారీ ఎత్తు అంచనాలున్న అఖండ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాను బాలయ్య చేయబోతున్నాడు. ప్రస్తుతం అఖండ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఆ తర్వాత గోపీచంద్ మూవీ పట్టాలెక్కబోతుంది.