వర్మ కాంపౌండ్ నటుడికి బాలయ్య సాయమా?

0

నటసింహా నందమూరి బాలకృష్ణ ధాతృత్వం గురించి అభిమానులు ఎంతో గొప్పగా చెబుతారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఉదార స్వభావం ఆయనది అంటూ నందమూరి అభిమానులు ప్రచారం చేస్తుంటారు. చిన్న పిల్లాడి మనస్తత్వం ఉన్న బాలయ్య ఆపత్కాలంలో సాయం కోరితే కాదనరు అని ఫ్యాన్స్ సోషల్ మీడియాల్లో నిరంతరం చర్చ సాగుతుంటుంది.

తాజాగా అలాంటి సాయమే బాలయ్య ఓ వ్యక్తికి చేశారట. అయితే ఆ సాయం చేసింది ఒక విరోధికి. తనపైనే సెటైరికల్ గా వ్యంగ్యంగా జోకులు వేస్తూ ఆర్జీవీ తెరకెక్కించిన `లక్ష్మీస్ ఎన్టీఆర్`లో నందమూరి తారకరామారావు పాత్రలో నటించిన పి.విజయ్ కుమార్ అనే నటుడి భార్యకు క్యాన్సర్ అని డాక్టర్లు ధృవీకరించారు. దాంతో ఆమెను హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చేర్చారట. తనకు అక్కడ చికిత్స కొనసాగుతోందని.. అందుకు సాయపడిన బాలయ్య మంచి మనసుకు ఇంత కంటే నిదర్శనం వేరొకటి అవసరం లేదని నందమూరి అభిమానులు ప్రచారం చేస్తున్నారు.

అయితే ఇది నిజమా? నటుడు విజయ్ కుమార్ తన భార్యకు క్యాన్సర్ చికిత్స కోసం బాలయ్యను సాయం కోరారా? తెలుగు దేశం కార్యాలయం నుంచి ఆయన రికమండేషన్ లెటర్ తెచ్చుకున్నారా? అంటూ ఒక సెక్షన్ అభిమానులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. తారక రామారావుకు డూప్ గా నటించిన ఆయనకు బాలయ్య సాయం చేశారా? అన్నదే పాయింట్ అవుట్ చేస్తూ డిస్కషన్ సాగుతోంది. ఇది వాస్తవమేనా కాదా? అన్నది బాలయ్య కాంపౌండ్ వర్గాలు కానీ.. సదరు నటుడు కానీ చెప్పాల్సి ఉంది. ఎన్టీఆర్ సతీమణి కీ.శే. బసవతారకం జ్ఞాపకార్థం బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Please Read Disclaimer