బాలయ్యకు హీరోయిన్ దొరకడం లేదా!

0

నటసింహ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ భారీ మాస్ యాక్షన్ సినిమా సెట్స్ కు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. బోయపాటి ప్రస్తుతం హీరోయిన్లను వెతికే పనిలో ఉన్నారు. ఆయన సెంటిమెంటు ప్రకారం .. ఇంతకుముందు లానే ఇద్దరు కథానాయికలు ఇందులోనూ నటిస్తారట. అయితే ఆ ఇద్దరినీ వెతకడమే కష్టంగా ఉందని చెబుతున్నారు.

బోయపాటి ఇంతకుముందు ‘లెజెండ్’ కోసం తనకు పరిచయం ఉన్న సీనియర్ భామల్నే రిపీట్ చేశారు. ముంబై నుంచి సోనాల్ చౌహాన్ లాంటి హాట్ బేబీని తెచ్చి అల్ట్రా మోడ్రన్ గా చూపించారు. కానీ ఈసారి అలా వీలు చిక్కడం లేదు. బాలయ్యకు ఓ హీరోయిన్ గా 27 ఏళ్ల కన్నడ బ్యూటీ రచిత రామ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ వినిపించినా.. తనను ఎవరూ సంప్రదించలేదని రచిత స్వయంగా వెల్లడించింది. ఇక బోయపాటి వైపు నుంచి అదే మాట వినిపించింది. రచితను ఒక నాయికగా అనుకున్నాం.. కానీ ఇంకా సంప్రదించలేదు అని బోయపాటి టీమ్ వెల్లడించింది.

ఇప్పటికే బాలయ్య కోసం ప్రతి నాయకుడిగా బాలీవుడ్ ఖల్ నాయక్ సంజయ్ దత్ ని దించుతున్నాడనే పుకార్లు వినిపిస్తున్నాయి. ఇక సెంటిమెంట్ గా భావించే నాయికల ఎంపికనే కష్టంగా మారింది. ప్రతిసారీ సీనియర్ బ్యూటీల్ని ఎంపిక చేస్తే రిపీటెడ్ ముఖాల్ని చూసేందుకు యూత్ ఆసక్తి కనబరచరు. అందుకే కాస్త బోయపాటి ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తున్నా సరైన భామ చిక్కడం లేదు. ఇక తెలుగులో నవతరం నాయికలు ప్రతి ఒక్కరూ వరుస కమిట్ మెంట్లతో బిజీగా ఉండడం వల్ల కూడా వెంటనే అనుకున్న పని అవ్వడం లేదని తెలుస్తోంది.
Please Read Disclaimer