అప్పుడు రాధిక.. ఇప్పుడు వేదిక!

0

నటసింహా బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో ఓ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కు రంగం సిద్దమవుతోంది. ప్రస్తుతం బాలయ్యకు హీరోయిన్లను వేతికే పనిలో బోయపాటి నిమగ్నమయ్యాడు. ఇప్పటికే పలువురు భామల పేర్లు తెరపైకి రాగా.. ఇద్దరిలో ఒక నాయికగా బాణం ఫేం వేదికను ఫైనల్ చేసారు. ఇంతకీ వేదిక రోల్ ఎలా ఉండబోతోంది? అంటే.. అందుకు సంబంధించిన సమాచారం తాజాగా లీకైంది.

లెజెండ్ లో బాలయ్యకు జోడీగా బోల్డ్ బ్యూటీ రాధిక ఆప్టే నటించిన సంగతి తెలిసిందే. బాలయ్య-రాధిక ఆప్టే జంట కెమిస్ట్రీ సినిమాలో బాగా వర్కవుట్ అయింది. ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ ని ఆద్యంతం ఆసక్తిరంగా మలిచాడు బోయపాటి. తాజాగా అదే సన్నివేశం మళ్లీ బాలయ్య- వేదిక ల మధ్య రిపీట్ అవుతుందని బయట ప్రచారం సాగుతోంది.

ఇందులో బాలయ్య-వేదిక ప్రేమించి పెళ్లి చేసుకుంటారుట. బాలయ్య ఇంట ఇల్లాలిగా వేదిక సహజ సిద్ధమైన పెర్పామెన్స్ తో ఆకట్టుకునేంత మంచిగా ఆ పాత్ర కుదిరింది. ఇక భార్య-భర్తల సన్నివేశాల్లో బాలయ్య పెర్పామెన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. పదునైన డైలాగులు కుదిరితే బలమైన ఫ్యామిలీ ఎపిసోడ్స్ లో బాలయ్య ఒదిగిపోతాడు. గత హిస్టరీలో బాలయ్యకు అలాంటి సన్నివేశాలు ప్రత్యేకమైన ఇమేజ్ నే తెచ్చి పెట్టాయి. వాటికేమాత్రం తగ్గకుండా బోయపాటి సినిమాలోనూ బాలయ్య ఇరగదీస్తాడనడంలో సందేహం లేదని చెబుతున్నారు.

ఇక బాలయ్య ఇప్పటికే ‘రూలర్’ కోసం సన్నబడే ప్రయత్నం చేశారు. ఈ సినిమాలో ప్రెంచ్ లుక్ లో కొత్తగా కనిపిస్తున్నారు. ఇక బోయపాటి సినిమా కోసం డైట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం సబ్ వే ఫుడ్ మాత్రమే తిని మరింత సన్నబడుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Please Read Disclaimer