మళ్లీ పరువు పోగొట్టుకోవడం అవసరమా?

0

నందమూరి బాలకృష్ణ ‘రూలర్’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు. ఈ నెలలోనే బాలయ్య ‘రూలర్’ చిత్రం విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి కళ్యాణ్ ఈ సినిమాను నిర్మించాడు. ఫిల్మ్ మేకర్స్ ఈ సినిమాకు ప్రేక్షకుల్లో ఇంకా బజ్ క్రియేట్ చేయలేక పోతున్నారు. విడుదలకు మరో మూడు వారాలు కూడా లేదు పబ్లిసిటీ విషయంలో ఇంకా చాలా వీక్ గానే అనిపిస్తుంది. సినిమాకు భారీ హైప్ లేని కారణంగా పలు ఏరియాల్లో ఈ సినిమాకు నిర్మాతలు ఆశించిన రేటు రావడం లేదని సమాచారం అందుతోంది.

ఇక బాలకృష్ణ గత చిత్రాల ఫలితాలను మరియు ఈ సినిమా బజ్ ను బేరీజు వేస్తున్న ఓవర్సీస్ బయ్యర్లు ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. గతంలో బాలయ్య నటించిన పలు సినిమాలను ఓవర్సీస్ లో విడుదల చేయగా రిలీజ్ కు అయిన ఖర్చులు కూడా వెనక్కు రాబట్టలేక పోయాయి. ఈ ఏడాది వచ్చిన ఎన్టీఆర్ కథానాయకుడు మరియు ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలు కూడా ఓవర్సీస్ రైట్స్ తీసుకున్న బయ్యర్లను నిండా ముంచాయి. ఆ అనుభవంతో రూలర్ చిత్రాన్ని ఓవర్సీస్ లో కొనుగోలు చేసేందుకు ఎవరు సాహసించడం లేదు.

సీడెడ్ మరియు ఇతర తెలుగు రాష్ట్రాల ఏరియాల్లో మంచి క్రేజ్ ఉన్న బాలయ్య ఓవర్సీస్ లో మాత్రం ఒకటి రెండు సార్లు తప్ప ఇప్పటి వరకు హిట్ కొట్టింది లేదు. అయినా కూడా అక్కడ తన సినిమాలను విడుదల చేస్తూనే ఉన్నాడు. ఓవర్సీస్ లో ప్రతి సారి బాలయ్యకు నిరుత్సాహం ఎదురవుతున్న మళ్లీ రూలర్ తో వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రూలర్ సినిమాను బయ్యర్లు కొనుగోలు చేయకున్నా సొంతంగా రిలీజ్ చేసే యోచనలో నిర్మాతలు ఉన్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అక్కడ ప్రేక్షకులు ఎప్పటికప్పుడు తిరష్కరిస్తూ వస్తున్నా కూడా ఎందుకు మళ్లీ ఓవర్సీస్ కు రూలర్ తో వెళ్లాలి.. మళ్లీ పరువు ఎందుకు పోగొట్టుకోవాలి కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
Please Read Disclaimer