బాక్సాఫీస్ వద్ద కొరటాల బోయపాటిల వార్..?

0

టాలీవుడ్ అగ్రదర్శకులలో రచయిత నుండి డైరెక్టరుగా మారిన వాళ్ళకి ప్రత్యేక స్థానం ఉంటుంది. వారిలో కొరటాల శివ బోయపాటి శ్రీనుల గురించి చెప్పుకోవాలంటే ఇద్దరూ పోసాని స్కూల్ నుండి వచ్చిన వాళ్ళే. వీరిలో ఇండస్ట్రీకి కొంచెం ముందుగా పరిచయమైన బోయపాటి మొదటి సినిమా ‘భద్ర’ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత బాలయ్య వెంకటేష్ రవితేజ ఎన్టీఆర్ అల్లు అర్జున్ రామ్ చరణ్ లాంటి పెద్ద స్టార్లను డైరెక్ట్ చేసిన అనుభవం ఉంది. సింహా లెజెండ్ సరైనోడు చిత్రాల ద్వారా మాస్ డైరెక్టరుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ వినయ విధేయ రామ చిత్రం పరాజయం చవిచూడడంతో రేసులో వెనకబడిపోయాడు. ప్రస్తుతం బోయపాటి నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా చేస్తున్నాడు. మరోవైపు ‘మిర్చి’ లాంటి బ్లాక్ బస్టర్ మూవీతో డైరెక్టరుగా మారిన రచయిత కొరటాల శివ. ఒక్క విజయంతో టాలీవుడ్ మొత్తం తన వైపు చూసేలా చేసుకున్న కొరటాల శివ తర్వాత మహేష్ బాబుతో శ్రీమంతుడు మరియు భరత్ అనే నేను ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ వంటి అద్భుతమైన చిత్రాలను అందించారు. కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ అనే సినిమా రూపొందిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఇండస్ట్రీలో ఎప్పటి నుండో వీరిద్దరికి పడదు అనే పుకారు ఉంది. వాస్తవానికి బోయపాటికి ఇంత సక్సెస్ రావడానికి కొరటాల కూడా ఒక కారణమని చెప్పవచ్చు. భద్ర సినిమా కథ కొరటాల వ్రాయగా ఆ క్రెడిట్ మొత్తం బోయపాటి తీసుకున్నాడని గతంలో ఒక ఇంటర్వ్యూలో స్వయంగా కొరటాలే వెల్లడించారు. కొరటాల దర్శకుడై వరుస విజయాలు సాధించడం మొదలు పెట్టిన తర్వాత బోయపాటి హవా తగ్గిందనే చెప్పాలి. ఇప్పుడు వీరిద్దరూ బాక్సాఫీస్ వద్ద తలపడే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. వివరాల్లోకి వెళ్తే ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న బాలయ్య చిరంజీవి నటించే చిత్రాలు ఒకే తేదీన విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.

కరోనా నేపథ్యంలో చిత్రీకరణ బంద్ చేసుకున్న ఈ రెండు చిత్రాలు ఒకే రోజు కాకపోయినా ఒకే సీజన్ లో విడుదలయ్యే ఛాన్సెస్ ఉన్నాయట. ఇద్దరు పెద్ద హీరోలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేస్తున్న సినిమాలు కావడంతో వీటిపై భారీ అంచనాలే ఉన్నాయ్. మొన్న సంక్రాంతి పోరు రసవత్తరంగా సాగిన సంగతి తెలిసిందే. ఒకరు సంక్రాంతి మొగుడు అంటే మరొకరు సంక్రాంతి రంకు మొగుడంటూ కయ్యానికి కాలు దువ్వుకున్నాయి. ఇప్పుడు వీరి మధ్య పోటీ కూడా రసవత్తరంగా మారే అవకాశాలు లేకపోలేదు. గతంలో కూడా చిరు బాలయ్యలు బాక్సాఫీస్ వద్ద చాలాసార్లు పోటీపడిన విషయం తెలిసిందే. ఏదేమైనా ఈసారి బాలయ్య వర్సెస్ చిరంజీవి – బోయపాటి వర్సెస్ కొరటాల అనక తప్పేలా లేదని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-