విలక్షణ నటుడిపై బ్యాన్ తప్పదా?

0

సౌత్ తో పాటు ఉత్తరాదిన కూడా ఎన్నో చిత్రాల్లో నటించిన విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ చుట్టు ఎప్పుడు ఏదో ఒక వివాదం రాజుకుంటూనే ఉంటుంది. రాజకీయాల్లో లేకున్నా ఆయన రాజకీయ విషయాలను ఎప్పటికప్పుడు ప్రస్థావిస్తూ కొందరిపై విమర్శలు చేస్తూ ఉంటాడు. తద్వార ఈయన ఎప్పుడు విమర్శలు.. వివాదాలను ఎదుర్కొంటూనే ఉంటాడు. తాజాగా ఈయన హిందుత్వం గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర వివాదానికి తెర తీస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్ లో రథోత్సవంకు సీఎం యోగి ఆధిత్యనాధ్ ముంబయి నుండి మోడల్స్ ను రప్పించి వారికి మేకప్ వేసి దేవుడి వేశాలు వేయిస్తున్నారు. వారికి ఐఏఎస్ ల నుండి సామాన్యుల వరకు అంతా కూడా నమస్కరిస్తున్నారు. ఇలాంటి పద్దతి దేశానికే మంచిది కాదని ప్రకాష్ రాజ్ ఒక టీవీ చర్చ కార్యక్రమంలో అన్నాడు. అదే సమయంలో హిందువులు వేడుకల పేరుతో మైనార్టీలను భయాందోళనకు గురి చేసేలా ప్రవర్తించడం కూడా జరుగుతుందంటూ హిందూ సంఘాలపై ఇండైరెక్ట్ గా ప్రకాష్ రాజ్ విమర్శలు చేశారంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపై హిందూ మహాసంఘం వారు తీవ్ర ఆరగహంతో ఉన్నారు. హిందూ దేవుళ్లను మరియు హిందూవులను కించపర్చే విధంగా మాట్లాడాడు అంటూ కన్నడ ఫిల్మ్ ఛాంబర్ కు హిందూ మహాసభ ఫిర్యాదు చేసింది. కన్నడ సినిమా పరిశ్రమ నుండి ప్రకాష్ రాజ్ ను బహిష్కరించాలంటూ విజ్ఞప్తి చేశారు. హిందువులను గౌరవించని ప్రకాష్ రాజ్ ను కన్నడ సినిమా పరిశ్రమలో బ్యాన్ చేయాల్సిందే అంటూ హిందూ సంఘాలు లేఖలో పేర్కొన్నాయి.

ఒక వేళ కన్నడ సినిమాల్లో ప్రకాష్ రాజ్ కు అవకాశాలు ఇస్తే తమ ఆందోళనలు ఉదృతం చేస్తామని.. ఆయన ఇకపై నటించబోతున్న సినిమాలను అడ్డుకుంటామని.. విడుదల కానివ్వమంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కన్నడ సినీ పరిశ్రమలో అధికారికంగా లేదంటే అనధికారికంగా ప్రకాష్ రాజ్ పై బ్యాన్ తప్పదనే చర్చ కన్నడ సినీ జనాల్లో జరుగుతోంది.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home