బండ్లకు కరోనా.. హెయిర్ ప్లాంటేషన్ ముప్పేనా?

0

తెలిసి చేసే తప్పు.. తెలియక చేసే తప్పు.. ఏదైనా తప్పు తప్పే. సౌందర్య పోషణ కోసం చేసిన తప్పు.. శోభన్ బాబులా రింగుల సుందరాంగుడిలా మారిపోవాలని చేసిన తప్పు.. వెరసి నటుడు కం నిర్మాత బండ్ల గణేష్ కి కరోనా పాజిటివ్ అని తేలింది. అప్పటివరకూ సైలెంట్ గా ఉన్న ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కి పాటకు గురైన ఘటన అది. బండ్లకు పాజిటివ్ అని తెలియగానే ఇండస్ట్రీలో పలువురు హీరోలు సహా ఆయన ఫ్యామిలీలోనూ టెన్షన్ మొదలైందని వార్తలొచ్చాయి. బండ్ల కాంటాక్టులెక్కడెక్కడ అన్న ఆరాలు మొదలయ్యాయి.

ప్రస్తుతం బండ్లతో కాంటాక్టులో ఉన్నవారంతా సేఫేనా? ఆయన కుటుంబం పరిస్థితేమిటి? అన్నది ఆరా తీస్తే ఆయనంతట ఆయనే సోషల్ మీడియాలో వివరాలందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం చాలా నిలకడగా ఉందని కోవిడ్-19 నుంచి కొలుకుంటున్నానని చెప్పారు. తన కుటుంబ సభ్యుల ఆరోగ్యం స్థిరంగా నిలకడగానే ఉంది. కరోనా పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటివ్ అని తేలినట్లు బండ్ల గణేష్ తెలిపారు. తనపై బయట సాగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని అన్నారు.

బండ్ల గణేష్ కి కరోనా పాజిటివ్ అని తెలియగానే ఓ యంగ్ హీరో కంగారు పడ్డారని ప్రచారమైంది. అయితే ఆయనకు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదని సేఫ్ గా ఉన్నారని కూడా తెలుస్తోంది. అయితే బండ్లకు పాజిటివ్ ఎలా? అని ప్రశ్నిస్తే.. తలకట్టు మార్పిడి (హెయిర్ ప్లాంటేషన్) చికిత్స కోసం వెళ్లారని ఆ తర్వాతనే కరోనా భారిన పడి ఉంటారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Please Read Disclaimer