సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

పవన్ కళ్యాణ్ పై బండ్ల గణేష్ కామెంట్స్..కారణం అదే!

0

ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ వార్తల్లో నిలుస్తుండగా.. అంతకుముందే సరిలేరు నీకెవ్వరు సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు బండ్ల గణేష్. ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ వరుస ట్వీట్స్ చేయడం పవన్ పట్ల తన ఫీలింగ్స్ బయటపెట్టడం హాట్ టాపిక్ గా మారింది.

”దేవుని అడగకూడదు తప్పు! కోరుకోవాలి అప్పుడే కోరిక తీరుతుంది” అంటూ మొదటి ట్వీట్ పెట్టిన బండ్ల గణేష్.. ఆ వెంటనే ”అడిగితే ఇచ్చేది ప్రసాదం పూజిస్తే వచ్చేది వరం నాకు కావాల్సింది వరం లాంటిది జీవితం అది తప్పకుండా వస్తుంది” అంటూ మరో ట్వీట్ చేశాడు. అంతటితో ఆగక ”కళ్ళల్లో కసి ముక్కు మీద పౌరుషం – మీసం లో నిజాయితీ.. నీ సొంతం బాస్” అంటూ పవన్ కళ్యాణ్ ని ఆకాశానికెత్తాడు బండ్ల గణేష్.

⁦ఏ ఉద్దేశ్యంతో బండ్ల గణేష్ ఇలా ట్వీట్ చేశాడో తెలియదు గానీ.. ఈ ట్వీట్స్ నెట్టింట సంచలనంగా మారాయి. ఎవరికివారు ఈ ట్వీట్స్ వెనుక బండ్ల గణేష్ మర్మం ఏమై ఉంటుందా? అనేది అంచనా వేస్తున్నారు. పవన్పై చేసిన ఈ వ్యాఖ్యలు ఆయనతో సినిమా ఛాన్స్ కోసమేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మొదటినుంచీ బండ్ల గణేష్కు పవన్ కళ్యాణ్ చాలా ఇష్టమని అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ నటుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆయనతో పాటే ఉన్న బండ్ల గణేష్.. ప్రొడ్యూసర్ గా మారి పవర్ స్టార్ తో రెండు సినిమాలను కూడా నిర్మించి సక్సెస్ అయ్యాడు. సో ఇప్పుడు పవన్ వరుస సినిమాలు కమిట్ అవుతున్నారు కాబట్టి తనకూ ఓ ఛాన్స్ ఇవ్వమని ఇలా పరోక్షంగా బండ్ల గణేష్ అడుగుతున్నాడని టాక్ వినిపిస్తోంది.
Please Read Disclaimer