‘పవర్ స్టార్’ ట్రైలర్ కి అందుకే డిస్ లైక్ కొట్టలేకపోయా!!

0

తెలుగు ప్రేక్షకులకు నటుడు నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన బండ్ల గణేష్.. ఆ తరవాత స్టార్ హీరోలతో సినిమాలు తీసే రేంజ్ కి ఎదిగి అందరిని షాక్ కి గురి చేసారు. ఇక తన మాటలతోటి వ్యవహారశైలి తోటి వార్తల్లో ఉంటూ వస్తుంటారు బండ్ల గణేష్. మనసుకు ఏది తోస్తే అది ముక్కుసూటిగా మాట్లాడుతూ విమర్శలకు గురి అవుతుంటాడు. అయితే ఇటీవల కరోనాని జయించిన బండ్ల గణేష్ మునుపటిలా ఆవేశంగా మాట్లాడటం లేదు.. ఒకప్పుడు గొడవలు పడ్డవారిపైన కూడా ప్రేమను కురిపిస్తున్నాడు. అయితే ఈ మధ్య అనుకోకుండా ఓ ట్రైలర్ లైక్ చేసి పవన్ కళ్యాణ్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు.

కాగా పవన్ కళ్యాణ్ కి బండ్ల గణేష్ వీరాభిమాని అనే విషయం అందరికి తెలిసిందే. నేను అభిమానిని కాదు భక్తుడిని అని చెప్పుకుంటాడు బండ్ల గణేష్. అయితే బండ్ల గణేష్ తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ పై సెటైరికల్ గా తీసిన ”పవర్ స్టార్” మూవీ ట్రైలర్ ని లైక్ చేయడం చర్చనీయాంశం అయింది. ఆ తర్వాత తాను చేసిన మిస్టేక్ తెలుసుకున్న గణేష్ ”ప్రామిస్.. ఇది పొరపాటున జరిగింది. నేను ఎప్పుడూ ఇలా చేయను. నా తప్పుకు క్షమించండి” అని ట్వీట్ చేసి వివరణ ఇచ్చుకున్నాడు. అయినా సరే కొందరు పవన్ ఫ్యాన్స్ బండ్ల గణేష్ పై నెగిటివ్ కామెంట్స్ చేసారు.

ఈ నేపథ్యంలో ఓ న్యూస్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ దీనిపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. తనకు టెక్నాలజీ మీద అంత పరిజ్ఞానం లేదని.. ట్విట్టర్ అలా చూస్తూ వెళ్తుంటే లైక్ కొట్టినట్టు పడిందని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో రోడ్డు మీద ఓ వ్యక్తికి యాక్సిడెంట్ అవడంతో అతనికి హెల్ప్ చేసే పనిలో పడిపోయానని.. అదే సమయంలో ఫ్యాన్స్ టీజర్ ని ఎందుకు లైక్ కొట్టావని తనను ప్రశ్నించారు.. తెలియక జరిగిన పొరపాటని వారికి క్షమాపణ చెప్పానని పేర్కొన్నాడు. అయితే తనకు డిస్ లైక్ కొట్టడం.. కొడితే అది మళ్లీ పోతుందని తెలీదని.. అందుకే చాలాసేపు అది అలాగే ఉంచానని చెప్పాడు. ఆ తర్వాత పక్కన ఉన్నవారు డిస్ లైక్ ఎలా చేయాలో చేప్తే దాన్ని డిస్ లైక్ చేశానని.. డిస్ లైక్ కొట్టడం ఇంత ఈజీనా అని తెలిసిందని క్లారిటీ ఇచ్చాడు బండ్ల గణేష్. అంతేకాకుండా యాక్ట్ చేయాల్సిన అవసరం తనకు లేదని.. లైక్ కొట్టినా రీ ట్వీట్ చేసినా చేశానని చెప్తానని.. నేను ఎవరి దయా దాక్షణ్యాల మీద బ్రతకడం లేదు.. ఎవరో కొడతారో తిడతారో అని అబద్దాలు చెప్పాలిన అవసరం లేదని.. బండ్ల గణేష్ కి ఓ క్యారక్టర్ ఉంది.. దాని మీద నేను బ్రతుకుతాను అని చెప్పుకొచ్చారు.