దేవుడికి ధన్యవాదాలు తెలిపిన బండ్ల.. అందుకేనా..?

0

టాలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా కలకలం రేపుతోంది. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అందరిని కబళించి వేస్తుంది. ఇప్పటికే జనాలంతా భయాలతో బ్రతుకుతుంటే తాజాగా టాలీవుడ్ కమెడియన్.. నిర్మాత బండ్ల గణేష్‌కు కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ వచ్చింది. బండ్ల గణేష్ తరచుగా షాద్‌నగర్‌లోని తన ఫౌల్ట్రీ ఫారమ్‌కు వెళ్లి వస్తుంటారట. ఈ క్రమంలో ఆయనకు కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారించారు. హైదరాబాద్‌లో ఓ గేటెడ్ కమ్యూనిటీలో నిర్మాత బండ్ల గణేష్ నివాసం ఉంటున్నారు. ఇదే కమ్యూనిటీలో కళామందిర్ కళ్యాణ్ నటుడు నాగశౌర్య కుటుంబం ఇతర ప్రముఖులు ఉంటున్నారు. దీంతో ఆయన ఇటీవల ఎవరెవరిని కలిశారని.. ప్రైమరీ కాంటాక్ట్ వ్యక్తుల వివరాలను అధికారులు పోలీసులు సేకరించారు.

ఇక ఇటీవలే తనకు పరిచయం ఉన్న డాక్టర్ వద్దకు వెళ్తే ఆయనని కరోనా టెస్ట్ చేయించుకోవాలని సూచించాడట. వెంటనే బండ్ల గణేష్ కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఆ విధంగా గణేష్ కి పాజిటివ్ నిర్ధారణ జరిగింది. గణేష్ మహమ్మారి బారిన పడ్డట్లు సమాచారం అందగానే తెలుగు సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే బండ్ల గణేష్ తాజాగా ఓ తీపి కబురు చెప్పాడు. ప్రస్తుతం కరోనా నుంచి గణేష్ కోలుకున్నారట. కొన్ని రోజుల క్వారంటైన్ తరువాత టెస్ట్ చేస్తే నెగటివ్ వచ్చిందట. ఈ సందర్భంగా గణేష్ ట్విట్టర్లో స్పందిస్తూ.. ‘దేవుడికి ధన్యవాదాలు’ తెలిపాడు. అంతేగాక కరోనా టెస్ట్‌కి సంబంధించిన రిపోర్ట్‌ని బండ్ల గణేష్ పోస్ట్ చేశాడు. దీంతో బండ్ల గణేష్ అభిమానులు.. సినీ ఇండస్ట్రీకి చెందినవారు కాస్త ఊపిరి పీల్చుకున్నారట. ప్రస్తుతం సోషల్ మీడియాలో బండ్ల గణేష్ పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ధైర్యంగా ఉంటే కరోనాని జయించవచ్చనేది మరోసారి బండ్ల నిరూపించాడని నెటిజన్లు బండ్లను ఉదాహరణగా చూపిస్తూ ట్వీట్లు చేయడం విశేషం.
Please Read Disclaimer