ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న పవన్ ఫ్యాన్ కు బండ్ల సాయం

0

సోషల్ మీడియాలో ప్రాణాంతక వ్యాధితో పోరాటం చేస్తున్న ఒక పవన్ కళ్యాణ్ అభిమాని నాగేంద్ర కు సంబంధించిన పోస్ట్ గత ఒకటి రెండు రోజులుగా వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ ను నటుడు నిర్మాత అయిన బండ్ల గణేష్ చూసి స్పందించాడు. పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్లేంత చొరవ ఉన్న బండ్ల గణేష్ ఆ కుర్రాడి విషయాన్ని పవన్ వద్దకు తీసుకు వెళ్తానంటూ హామీ ఇచ్చాడు. మీరు ఎక్కడ ఉంటారు. మీకోసం నేను పవన్ కళ్యాణ్ గారిని కలువబోతున్నాను అంటూ ట్వీట్ చేశాడు.

గతంలో పలు సార్లు ఇలాంటి ఫ్యాన్స్ ను పవన్ కలిసిన సందర్బాలు ఉన్నాయి. చాలా దూరాన ఉన్న ఫ్యాన్స్ వద్దకు కూడా పవన్ వెళ్లాడు. కనుక నాగేంద్రను కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఆదుకుంటాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఉన్నత చదువులు చదివి పోలీస్ ఆఫీసర్ గా ఉద్యోగం చేయాలనేది నాగేంద్ర కోరిక. కాని ప్రస్తుతం ప్రాణాంతక వ్యాదితో బాధపడుతున్నాడు. ఆయన తల్లి కూలి పని చేసుకుని జీవిస్తూ ఉంటుంది. తన కొడుకుకు ట్రీట్మెంట్ ఇప్పించలేక ఆమె కన్నీరు పెట్టుకుంటుంది. కనుక బండ్లగణేష్ ఈ విషయాన్ని పవన్ వద్దకు తీసుకు వెళ్తే నాగేంద్రకు న్యాయం జరుగుతుంది.