బంగార్రాజు 2020 సమ్మర్ ప్లాన్?

0

2018-19 సీజన్ కింగ్ నాగార్జునకు ఆశించినంతగా కలిసి రాలేదు. దేవదాస్- మన్మధుడు 2 చిత్రాలతో తానొకటి ఆశిస్తే ఫలితం ఇంకోలా వచ్చింది. ఆ క్రమంలోనే నాగ్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇటీవలే బిగ్ బాస్ సీజన్ 3ని సక్సెస్ చేసిన నాగ్ రెట్టించిన ఉత్సాహంలో తదుపరి మెయిన్ ట్రాక్ లోకి వచ్చేశారు. త్వరలో ఓ చిత్రాన్ని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు.

ఈసారి సోలమన్ దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ నిరంజన్ రెడ్డితో కలిసి ఓ సినిమాకి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ సాగుతోంది. 2020లో ఫ్రెష్ గా సినిమాని ప్రారంభిస్తారట. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంలో నాగ్ పాత్ర బాగా కుదిరిందని సమాచారం. ఇక ఇందులో చందమామ కాజల్ కథానాయికగా నటించే అవకాశం ఉందని వార్తలొచ్చినా ఒక కొత్త నాయికను ఎంచుకునే ఛాన్స్ లేకపోలేదని తెలుస్తోంది.

మరోవైపు నాగార్జున మరో రెండు ప్రాజెక్టులపైనా కసరత్తు చేస్తున్నారు. అందులో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు చిత్రాన్ని 2020 వేసవిలో ప్రారంభించి 2021 సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేశారట. దీంతో పాటు అజయ్ దేవగన్ నటించిన రైడ్ సినిమా రీమేక్ హక్కుల్ని చేజిక్కించుకోనున్నారని తెలిసింది. మరోవైపు బాలీవుడ్ చిత్రం బ్రహ్మాస్త్రలో నాగార్జున ఓ ఆసక్తికర పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.
Please Read Disclaimer