ఈసారి కూడా బంగార్రాజు ను పక్కన పెట్టారా?

0

అక్కినేని నాగార్జున ఈమధ్య నటించిన సినిమాలు వరసగా నిరాశపరుస్తున్నాయి. నాగార్జున నటించిన చివరి సూపర్ హిట్ ఏదని చూస్తే మాత్రం ‘సోగ్గాడే చిన్ని నాయన’ సినిమా పేరు చెప్పుకోవాల్సి ఉంటుంది. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా 2016 లో విడుదలైంది. అన్నపూర్ణ బ్యానర్ కు మంచి లాభాలు తీసుకొచ్చిన సినిమా అది. అప్పటి నుంచి ఆ సినిమాకు సీక్వెల్ గా ‘బంగార్రాజు’ ను సెట్స్ మీదకు తీసుకుపోవాలని ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదు.

నాగార్జున ‘మన్మథుడు 2’ తర్వాత ఈ సినిమానే చేస్తారని వార్తలు వచ్చాయి. కళ్యాణ్ కృష్ణ ఈ ‘బంగార్రాజు’ స్క్రిప్ట్ పై పని చేస్తున్నారని.. త్వరలోనే ఈ సినిమా లాంచ్ అవుతుందని.. నాగచైతన్య కూడా ఈ సినిమాలో నటిస్తారని అన్నారు. అయితే ‘బంగార్రాజు’ ఇక అటకెక్కినట్టేనని తాజాగా టాక్ వినిపిస్తోంది. అయితే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు నాగార్జున సిద్ధంగానే ఉన్నారట. అన్నపూర్ణ నుంచి కళ్యాణ్ కృష్ణకు శాలరీ కూడా ఇస్తున్నారట.. అయితే ‘బంగార్రాజు’ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదని అంటున్నారు.

ఇదిలా ఉంటే నాగార్జున ‘మన్మథుడు 2’ తర్వాత తన కొత్త సినిమాను ప్రకటించలేదు. హిందీలో ‘బ్రహస్త్ర’ సినిమాలో ఒక కీలకపాత్రలో నటించారు. ఆ సినిమా కాకుండా నాగార్జున నటించే ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి క్లారిటీ రావాల్సి ఉంది.




Please Read Disclaimer