లిప్ లాక్ రొమాంటిక్ సీన్స్ పై బోల్డ్ కామెంట్స్

0

బాలీవుడ్ సినిమాల స్థాయిలో సౌత్ లో లిప్ లాక్ మరియు బోల్డ్ సీన్స్ రాలేదని అనుకుంటున్న సమయంలో అర్జున్ రెడ్డి కొత్త ట్రెండ్ ను తీసుకు వచ్చాడు. సినిమాలో లెక్కకు మించి లిప్ లాక్ సీన్స్ మరియు బోల్డ్ డైలాగ్స్ ఇంకా రొమాంటిక్ సీన్స్ చాలా ఉన్నాయి. సౌత్ లో ఈ సినిమాపై విమర్శలు కూడా వ్యక్తం అయ్యాయి. అర్జున్ రెడ్డి తమిళ వర్షన్ ఆధిత్య వర్మలో కూడా ముద్దు సీన్స్ లెక్కకు మించి ఉన్నాయి. అలాగే రొమాంటిక్ సీన్స్ కు కూడా అడ్డు అదుపు లేదు. ధృవ్ తో ఈ చిత్రంలో బనిత సంధు హీరోయిన్ గా నటించింది.

ముద్దు సీన్స్ మరియు రొమాంటిక్ సీన్స్ విషయంలో బనిత సంధు మాట్లాడుతూ బోల్డ్ వ్యాఖ్యలు చేసింది. ఈ రోజుల్లో ముద్దు సీన్స్ అనేవి చాలా కామన్. నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటిని చేశాను. రెగ్యులర్ సీన్స్ చేసినట్లుగానే నేను వాటిని చేశాను. అంతకు మించి ఏమీ లేదు. ఎందుకు వాటిని ప్రత్యేకంగా చూస్తూ జనాలు విమర్శలు చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదంటూ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేసింది.

సౌత్ లో ఈ స్థాయి రొమాంటిక్ ముద్దు సీన్స్ చాలా అరుదుగా వస్తూ ఉంటాయి. ప్రేక్షకులు కథలో భాగంగా ముద్దులు రొమాంటిక్ సీన్స్ ఉంటే పర్వాలేదు అనుకుంటారు కాని కావాలని ముద్దు సీన్స్ జొప్పిస్తే మాత్రం ఆసక్తి చూపించరు అనే విషయం గతంలో కూడా వెళ్లడయ్యింది. హీరోయిన్ బనిత సంధుకు ఈ సీన్స్ కామన్ అనిపించినా అన్ని సినిమాల్లో ఇలా చేయడం మంచిది కాదంటూ నెటిజన్స్ ఆమెను హెచ్చరిస్తున్నారు.
Please Read Disclaimer