బిబి నాలుగు సీజన్ లకు అల్లరి నరేష్ కు సంబంధం

0

అల్లరి నరేష్ తెలుగు బిగ్ బాస్ హౌస్ కు ఇప్పటి వరకు రెండు సార్లు వెళ్లాడు. మొదటి సారి మేడ మీద అబ్బాయి సినిమా ప్రమోషన్ కోసం వెళ్లగా రెండవ సారి సిల్లీ ఫెలోస్ సినిమా ప్రమోషన్ లో భాగంగా వెళ్లాడు. ఆ తర్వాత సీజన్కు అంటే మూడవ సీజన్ కు అల్లరి నరేష్ వెళ్లలేదు. ప్రస్తుతం జరుగుతున్న సీజన్ కు కూడా వెళ్లే అవకాశం లేదు. కాని ఈ సీజన్ లో ఆయనతో నటించిన ఇద్దరు హీరోయిన్స్ హౌస్ లో ఉన్న కారణంగా ఆయన పేరు మళ్లీ ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే హౌస్ లో ఉన్న మోనాల్ గజ్జర్ గతంలో అల్లరోడితో నటించింది. నిన్నటి ఎపిసోడ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన స్వాతి దీక్షిత్ కూడా అల్లరి నరేష్ తో నటించిన హీరోయిన్ అవ్వడం విషేశం.

బిగ్ బాస్ మూడు సీజన్ లలో కూడా అల్లరి నరేష్ కు జోడీగా నటించిన హీరోయిన్స్ కంటెస్టెంట్స్ గా ఉన్నారు. మొదటి సీజన్ లో అల్లరి నరేష్ తో ‘నేను’ సినిమాతో నటించిన అర్చన కంటెస్టెంట్ గా లోనికి వెళ్లింది. రెండవ సీజన్ లో అందరి దృష్టిని ఆకర్షించిన నందిని రాయ్ అల్లరి నరేష్ తో ‘సిల్లీ ఫెలోస్’ సినిమాలో నటించింది. ఇక ప్రస్తుత సీజన్లో ఉన్న మోనాల్ గజ్జర్ సుడిగాడు మరియు స్వాతి దీక్షిత్ జంప్ జిలాని సినిమాలో అల్లరి నరేష్ తో నటించారు. మొత్తానికి అల్లరోడి పేరు బిగ్ బాస్ సోషల్ మీడియా ట్రెండ్ లో ప్రముఖంగా కనిపిస్తుంది. వచ్చే సీజన్ లోనూ అల్లరి నరేష్ హీరోయిన్ ఉంటుందేమో చూడాలి.