బిబి3: బాలీవుడ్ నుండి కాదు టాలీవుడ్ నుండే

0

బాలకృష్ణ బోయపాటిల కాంబోలో రాబోతున్న మూడవ సినిమా షూటింగ్ పునః ప్రారంభంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. లాక్ డౌన్ కు ముందు రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను అతి త్వరలోనే ప్రారంభించబోతున్నారు. కీలక షెడ్యూల్స్ ముందు ముందు ఉన్నాయి. ఇప్పటి వరకు హీరోయిన్ మరియు విలన్ ల విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. షూటింగ్ కు వెళ్లబోతున్న నేపథ్యంలో త్వరలోనే హీరోయిన్ మరియు విలన్ ల విషయంలో అధికారికంగా క్లారిటీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారు.

ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్.. వివేక్ ఒబేరాయ్ లతో పాటు పలువురు నటులను విలన్ పాత్ర కోసం సంప్రదిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ గా శ్రీకాంత్ మాత్రమే కనిపించబోతున్నాడట. ఆ విషయంను షూటింగ్ ప్రారంభం అయిన వెంటనే అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఈమద్య కాలంలో శ్రీకాంత్ విలన్ గా కొన్ని సినిమాల్లో నటించాడు.

ఆ సినిమాల్లో శ్రీకాంత్ అంతగా ఆకట్టుకోలేక పోయాడు కనుక ఆయన్ను తీసుకోక పోవడం బెటర్ అనే అభిప్రాయం వ్యక్తం అయ్యిందట. కాని బోయపాటి మాత్రం ఆయనకే ఓటు వేసినట్లుగా మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది. ఫ్యామిలీ హీరోగా ఎన్నో సినిమాల్లో నటించిన శ్రీకాంత్ ఈమద్య కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నాడు. బాలయ్య మరియు శ్రీకాంత్ లు గతంలో కలిసి నటించారు. ఇప్పుడు బోయపాటి సినిమా కోసం మరోసారి వీరు కలిసి నటించబోతున్నారు.