BB3 : విన్నర్ కు రన్నర్ కు మద్య ఓట్ల తేడా ఎంత?

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 3 పూర్తయ్యింది. ఈ సీజన్ విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ నిలువగా శ్రీముఖి రన్నర్ గా నిలిచింది. మొదటి నుండి కూడా శ్రీముఖి విన్నర్ అంటూ ఆమె అభిమానులు చాలా నమ్మకం పెట్టుకున్నారు. కాని అనూహ్య పరిణామాల మద్య రాహుల్ సిప్లిగంజ్ ఫైనల్ విజేతగా నిలిచాడు. శ్రీముఖి అభిమానులు చాలా నమ్మకంగా ఆమె విజేత అవుతుందని అనుకున్నారు. రాహుల్ కు చివరి రెండు మూడు వారాల్లో అనూహ్యమైన మద్దతు దక్కింది.

ఫైనల్ వారంలో దాదాపుగా 8.5 కోట్ల ఓట్లు పోల్ అయ్యాయంటూ బిగ్ బాస్ ఫైనల్ స్టేజ్ పై నాగార్జున ప్రకటించాడు. అందరిలో అత్యల్పంగా అలీకి ఓట్లు పడ్డాయి. ఈ విషయం అందరూ ఊహించారు. ఆయన ఎలిమినేట్ అయ్యి వైల్డ్ కార్డ్ తో రీ ఎంట్రీ ఇచ్చాడు. అందుకే అలీ బిగ్ బాస్ ట్రోఫీకి అర్హుడు కాదని చాలా మంది భావించారు. ఇక మూడు నాల్గవ స్థానాల కోసం బాబా భాస్కర్ మరియు వరుణ్ సందేశ్ లు పోటీ పడ్డారు. స్వల్ప ఓట్ల తేడాతో బాబా భాస్కర్ తర్వాత స్థానంలో అంటే నాల్గవ స్థానంలో వరుణ్ నిలిచాడు.

అలీ.. వరుణ్.. బాబా భాస్కర్ ల ఓట్లతో పోల్చితే శ్రీముఖి మరియు రాహుల్ ల ఓట్లు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం శ్రీముఖి మరియు రాహుల్ ల మద్య చాలా టఫ్ ఫైట్ నడిచిందట. ఒక రోజు శ్రీకి ఎక్కువ ఓట్లు వస్తే మరో రోజు రాహుల్ కు ఎక్కువ ఓట్లు పడ్డాయట. ఇలా చివరికి రాహుల్ కు శ్రీముఖి కంటే 1.25 శాతం ఓట్లు ఎక్కువగా పడ్డాయంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్ అవుతోంది. మాటీవీ వర్గాల వారు ఈ విషయాన్ని లీక్ చేశారంటూ వారు చెబుతున్నారు.

అతి స్వల్ప తేడాతోనే శ్రీముఖి రన్నర్ గా నిలిచిందని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. శ్రీముఖి కూడా విన్నర్ గానే తాము భావిస్తామంటూ వారు చెబుతున్నారు. శ్రీముఖికి కూడా ఆమె అభిమానులు భారీ ఎత్తున ర్యాలీ తీసి మరీ ఆహ్వానించారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Please Read Disclaimer