బిబి4 : బ్యాక్ టు బ్యాక్ ఆ ముగ్గురు ఔట్

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 క్లైమాక్స్ కు వచ్చింది. ఈ వారం మొత్తం ఎనిమిది మంది హౌస్ లో ఉన్నారు. వారిలో ఆరుగురు నామినేషన్ లో ఉన్నారు. ఇక టాప్ 5 లో ఉండబోతున్న కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయమై ఇప్పటికే క్లారిటీ వచ్చింది. బిగ్ బాస్ విశ్లేషకులు మరియు రెగ్యులర్ గా చూస్తున్న ప్రేక్షకులు మరియు మాజీ కంటెస్టెంట్స్ అంచనా మేరకు అభిజిత్ లాస్య అవినాష్ సోహెల్ మరియు అఖిల్ లు టాఫ్ 5 లో ఉంటారు. మిగిలి ఉన్న ఆ ముగ్గురు హారిక మోనాల్ మరియు అరియానాలు వరుసగా మూడు వారాలు ఎలిమినేట్ అవ్వబోతున్నారు.

ఈ వారం మోనాల్ బయటకు వెళ్లే అవకాశం ఎక్కువగా ఉందని ప్రచారం జరగుతుంది. మోనాల్ ను ఇంకా బిగ్ బాస్ కాపాడితే మాత్రం అరియానా బయటకు వెళ్లే అవకాశం ఉంది. మోనాల్ ఇంకా సేవ్ అయ్యే అవకాశం లేదని చాలా మంది బలంగా నమ్ముతున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 4 లో అత్యంత వీక్ కంటెస్టెంట్ అయినా కూడా మోనాల్ సేవ్ అవుతూ వస్తుందని అంటున్నారు. ఆ విమర్శలు ఘోరంగా వస్తున్నా కూడా నిర్వాహకులు మాత్రం ఆమెను సేవ్ చేస్తూ వచ్చారు. ఇక కథ క్లైమాక్స్ కు వచ్చింది కనుక ఆమెను ఎలిమినేట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇదే సమయంలో బిగ్ బాస్ తర్వాత రెండు వారాల్లో అరియానా మరియు హారికలు ఎలిమినేట్ అవ్వబోతున్నారు. ఈ మగ్గురు వరుసగా మూడు వారాలు ఎలిమినేట్ అవ్వనున్నారు. ఈ వారం హారిక ఎలిమినేషన్ తప్పించుకుంటే వచ్చే వారం ఆమెకు కెప్టెన్ అవ్వడం వల్ల ఇమ్యూనిటీ దక్కుతుంది. అయితే ఆ తర్వాత అయినా ఆమెకు ఎలిమినేషన్ తప్పదంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అద్బుతం జరిగి వీరు నామినేషన్ లోకి వెళ్లకుంటే తప్ప టాప్ 5 లోకి వెళ్లే అవకాశం లేదు అంటున్నారు.