బిబి4 : ఈ వీకెండ్ పాత సీన్ రిపీట్ అయితే రికార్డ్ రేటింగ్ ఖాయం

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 అయిదు వారాలు పూర్తి చేసుకోబోతుంది. రేపు మరియు ఎల్లుండి వీకెండ్ ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ వారం చాలా మంది ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యి ఉండటంతో పాటు అందరు కూడా చాలా బలంగా ఉన్నారు. కనుక ఈ వారంలో ఎలిమినేషన్ ఎవరు అవుతారు అనే విషయమై ఎలిమినేషన్ నామినేషన్ జరిగినప్పటి నుండి ఆసక్తిగా ఉంది. దానికి తోడు గత సీజన్ లో మాదిరిగా ఈ సీజన్ లో కూడా ఈ వీకెండ్ ఎపిసోడ్ కు రమ్యకృష్ణ హోస్టింగ్ చేయబోతుందనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

నాగార్జున ఇటీవలే వైల్డ్ డాగ్ సినిమా కోసం విదేశాలకు వెళ్లాడు. అక్కడ నుండి వీకెండ్ ఎపిసోడ్ చిత్రీకరణకు నాగార్జున వస్తారా లేదంటే అక్కడ నుండి హోస్టింగ్ చేస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది. గత సీజన్ లో నాగార్జున పుట్టిన రోజు కోసం విదేశాలకు వెళ్లాడు. ఆ సమయంలో రమ్యకృష్ణ ఆ వారం హోస్ట్ గా వ్యవహరించారు. కనుక ఈసారి కూడా ఆమెతో హోస్టింగ్ చేయిస్తే ప్రేక్షకులు కొత్తగా ఫీల్ అవ్వడంతో పాటు ఆ వారానికి మంచి రేటింగ్ వస్తుందనే నమ్మకంను నిర్వాహకులు వ్యక్తం చేస్తున్నారు.

నిజంగానే రమ్యకృష్ణ రేపటి వీకెండ్ ఎపిసోడ్ కు హోస్ట్ గా వ్యవహరిస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా ఆ షోకు పట్టం కట్టే అవకాశం ఉంది. అంటే రికార్డు స్థాయి రేటింగ్ ను దక్కించుకుంటుందని బుల్లి తెర వర్గాల వారు అంటున్నారు. కొత్తదనం కోసం వైవిధ్యం కోసం నాగార్జున ప్లేస్ లో రమ్యకృష్ణ వస్తే ఖచ్చితంగా రేటింగ్ విషయంలో ఈ సీజన్ లో రేపటి రేటింగ్ రికార్డ్ గా నమోదు అవుతుందని అంటున్నారు. మరి కొన్ని గంటల్లో వీకెండ్ ఎపిసోడ్స్ హోస్ట్ ఎవరు అనే విషయంలో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.