బిబి4 : మూడవ వైల్డ్ ఎంట్రీతో హౌస్ లో కళకళ

0

తెలుగు బిగ్ బాస్ మూడవ వారం పూర్తి కాబోతున్న సమయంలో మూడవ వైల్డ్ కార్డ్ ఎంట్రీ జరిగింది. ఇప్పటికే కుమార్ సాయి మరియు ముక్కు అవినాష్ లో వైల్డ్ ఎంట్రీ ఇవ్వగా హీరోయిన్ స్వాతి దీక్షిత్ వైల్డ్ కార్డ్ తో ఎంట్రీ ఇచ్చింది. నిన్నటి ఎపిసోడ్ కెప్టెన్సీ టాస్క్ తో మొదలు అయ్యింది. గంగవ్వతో పాటు అభిజిత్.. హారిక.. అవినాష్ లు కెప్టెన్సీ పోటీదారులుగా ఉండగా అంతా కూడా ఏకగ్రీవంగా గంగవ్వకు మద్దుతు తెలిపారు. దాంతో చాలా ఈజీగా గంగవ్వ కెప్టెన్ అయ్యింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులు రూల్స్ అస్సలు పాటించడం లేదు అంటూ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి మళ్లీ ఇలాంటివి పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించాడు.

ఇంటి సభ్యులు అంతా ఎవరి మచ్చట్లలో వారు ఉండగా బుట్టబొమ్మ పాట మొదలైంది. అంతా ఆశ్చర్యంగా చూస్తున్న సమయంలో మాస్క్ పెట్టుకుని స్వాతి దీక్షిత్ లోనికి ఎంట్రీ ఇచ్చింది. మొదట ఆమెను ఎవరు కనిపెట్టలేక పోయారు. మాస్క్ తీసిన తర్వాత కూడా ఆమె ఎవరో ఎక్కువ మంది గుర్తించలేదు. తనను తాను పరిచయం చేసుకున్న తర్వాత స్వాతి ముచ్చట్లలో ఉండగా బిగ్ బాస్ ఆమెకు స్వాగతం చెప్పి మగవారికి ఆమెను ఇంప్రెస్ చేయమంటూ టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ లో భాగంగా స్వాతిని ఇంప్రెస్ చేసేందుకు ఒకొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నించారు.

స్వాతి తనను రాజశేఖర్.. అఖిల్.. నోయల్ మరియు అవినాష్ లు ఇంప్రెస్ చేశారంటూ చెప్పడంతో వారికి ప్రత్యేకమైన బహుమానం లభించింది. ఆమెతో ఆ నలుగురు పార్టీ చేసుకునే అవకాశం లభించింది. చాలా సమయం ఆ పార్టీ జరిగింది. ఆ తర్వాత అర్థ రాత్రి సమయంలో అభిజిత్ మరియు స్వాతిల ముచ్చట్ల గురించి ఇంటి సభ్యులు గుసగుసలాడుకోవడం జరిగింది. ఇక నిన్నటి ఎపిసోడ్ లో స్టోర్ రూంలో అభిజిత్ మరియు మోనాల్ లు కలిసి కూర్చుని మాట్లాడుకున్నారు. ఆ సమయంలో అభిజిత్ అంటే ఇష్టం అన్నట్లుగా మోనాల్ మాట్లాడింది. ఆ విషయమై అఖిల్ కోపంగా ఉన్నాడు. ఇక నేటి వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఉక్కు హృదయం టాస్క్ గురించి ఏం చెప్పబోతున్నరు ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నరు అనేది ఆసక్తికరంగా సాగబోతుంది.