బిబి4 లీక్ : ఈ వారం ఎలిమినేషన్ మెహబూబ్

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 మూడవ వారం తర్వాత హౌస్ నుండి ఎలిమినేషన్ కాబోతున్నది మెహబూబ్. మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయిన వారిలో అతి తక్కువ ఓట్లు పొందటంతో మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడట. నేడు రేపు ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ లను నేడు ఒక్క రోజే షూట్ చేస్తారు. నేటి ఎపిసోడ్ లో ముగ్గరు సేవ్ అవ్వనుండగా రేపటి ఎపిసోడ్ లో మెహబూబ్ ఎలిమినేట్ అంటూ నాగార్జున ప్రకటించబోతున్నాడట. బిగ్ బాస్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి మొదటి వారంలోనే ఎలిమినేషన్ కు నామినేట్ అయ్యాడు. అయితే కరాటే కళ్యాణి ఎలిమినేషన్ అవ్వడంతో ఆయన సేఫ్ అయ్యాడు.

మొదటి వారంలో సేవ్ అయిన కుమార్ సాయి ఈ వారంలో మళ్లీ నామినేట్ అవ్వడంతో ఖచ్చితంగా ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఆయనే అంటూ అంతా బలంగా అనుకున్నారు. కాని కుమార్ సాయి సినిమాల్లో నటించిన క్రేజ్ ఉండటం వల్ల ఓట్లు బాగానే పడ్డాయట. దానికి తోడు ఆయన్ను అంతా కార్నర్ చేశారంటూ భావించి కూడా ఓట్లు వేసినట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబ్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్న మెహబూబ్ కాస్త ఎగ్రసివ్ గా ఉండటంతో పాటు ఊరికే ఎమోషనల్ అవుతున్న కారణంగా ఆయన్ను ప్రేక్షకులు ఎలిమినేట్ చేసినట్లుగా కూడా భావిస్తున్నారు. మొత్తానికి రేపటి ఎపిసోడ్ లో మెహబూబ్ ఎలిమినేట్ అయినట్లుగా నాగార్జున ప్రకటించడం ఖాయం అంటూ మీడియా వర్గాల వారు విశ్వసనీయంగా చెబుతున్నారు.