ఇంతకీ ఉచిత షో పప్పులుడికాయా?

0

చాలా బార్ లలో హ్యాపీ హవర్స్ పేరుతో 50 శాతం డిస్కౌంట్ కి మందు సరఫరా చేస్తారు..అంటే ఫ్రీకి ఆలవాటు చేస్తారు. మందు బాగా ఎక్కిన తరువాత …ఒరిజినల్ రేట్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు అలవాటు పడిన ప్రాణం ఫుల్ రేట్ లో కొనుక్కుని బాగా తాగుతారు.. ఇదీ బార్ ఓనర్స్ స్టాటిస్టిక్స్. దీనిని సినిమాకి కూడా అప్లయ్ చేస్తున్నారట మన నిర్మాతలు.. !! ప్చ్.. ఇదేం చోద్యం అనకండి.. అది నిజమే! నేడు(నవంబర్ 22న) ఈ ఫార్మాట్ లో ఒక సినిమా రిలీజైంది కూడా.

ఇకమీదట మోర్నింగ్ షో ఉచితంగా వేసి.. మ్యాట్నీకి డబ్బులు పెట్టి టిక్కెట్లు కొనే అలవాటు చేస్తారట. ఒక చిన్న సినిమా ఆ హీరో చేతన్ చాలా కష్టపడి మంచి స్క్రీన్ ప్లే టెంపో తో సినిమా తీసి.. దాన్ని రేలీజ్ చేయడం నూన్ షోస్ వరకు ఫుల్ రప్పించే ప్లాన్ వేశారు. ఆ సాహసంలో ఉచిత షో వేసారు. ఆయన వెనక ఉండి నడిపించింది రాంకుమార్ అనే పెద్దాయన అని తెలిసింది. ఇండస్ట్రీలో ఈ ప్రయత్నంపై ఆసక్తికర చర్చ సాగుతోంది.

పరిమిత బడ్జెట్ తో తీసిన ఈ చిన్న సినిమాకి మధ్యాహ్నం ఆట వరకూ షోస్ ఫుల్ తెచ్చే ప్రయత్నం చేశారు. ఉచితం అనగానే చాలా థియేటర్లు కిక్కిరిసాయట. ఇక మ్యాట్నీ నుంచి నడిపించేది ఆడియెన్స్ మాత్రమే. మొదటి సారి ఇలా ప్రయోగం చేసారు. అసలు రిజల్ట్ ఏమిటి? అన్నది మిగతా ఆటల కలెక్షన్స్ చెబుతాయి. సక్సెస్ అవ్వాలని పలువురు నిర్మాతలు ఆకాంక్షించారు. ఇదే బాటలో ఇకపైనా మరికొందరు చిన్న సినిమాలు తీసి వదులుతారట. ఉచితంగా ఉదయం ఆట చూపించి మ్యాట్నీ నుంచి టిక్కెట్లు ఆన్ లైన్ లో అమ్ముతారట. మరి ఇదేం చోద్యమో కానీ.. ఇలాంటి చిన్న సినిమాల్ని నిజంగానే జనం ఆదరిస్తారా? టెక్నాలజీ వెసులుబాటుతో ఈ ప్రయత్నం బాగానే ఉంది కానీ.. తెరపై క్వాలిటీగా సినిమా చూడగలరా? అన్నది తేలాల్సి ఉంది. ఉచిత షో వేసినా కంటెంట్ లేకపోయినా గ్రిప్పింగ్ గా కుర్చీ అంచున కూర్చోపెట్టకపోయినా కష్టమే. ఇకపోతే వందల కోట్లు ఖర్చు పెట్టి భారీ చిత్రాలు తీసినా గ్రిప్పింగ్ గా లేకపోతే జనాలు తిరస్కరిస్తున్నారు. మరి ఇలాంటప్పుడు ఇంకా ఐఫోన్ లు.. 5డి కెమెరాలతో తీసి హిట్లు కొడతారా? ఆ రెండిటి మధ్యనా సన్నని లైన్ ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది మరి!

Comments are closed.