బ్యూటిఫుల్ బ్యాడ్ గర్ల్

0

మన టాలీవుడ్లో ఇతర భాషల నుంచి వచ్చిన భామలు.. ఉత్తరాది భామల హవా ఎక్కువగా ఉంటుందనే సంగతి అందరికీ తెలిసిందే. అదే బాలీవుడ్లో విదేశీ భామల జోరు ఎక్కువ. బాలీవుడ్ లలో దాదాపు పదిమంది విదేశీ హీరోయిన్లు ఉన్నారంటేనే వారి హవా ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. వారి లో శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కూడా ఉంది. ఈ భామకు యూత్ లో క్రేజ్ చాలా ఎక్కువ.

జాక్వెలిన్ ఇన్స్టా ఖాతాకు 37 మిలియన్లకు పైగా ఫాలోయర్లు ఉన్నారు. ‘సాహో’ లో బ్యాడ్ బాయ్ సాంగ్ కు ప్రభాస్ తో కలిసి స్టెప్స్ వేయడంతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయింది. ఈభామ ప్రఖ్యాత డబ్బూ రత్నాని క్యాలెండరుపై మెరిసింది. ఈమధ్యే డబ్బూ రత్నాని 2020 క్యాలెండరు విడుదల చేశారు. ఈ క్యాలెండరు కోసం ఓ హాట్ అవతారంలో గుర్రంతో కలిసి పోజిచ్చింది. స్లిట్స్ ఉండే బ్లాక్ లెహెంగా.. పైనేమో హాట్ టాప్ తో ఒక ఇంటర్నేషనల్ మోడల్ తరహాలో నిలుచుంది. తలకు క్యాప్ పెట్టుకోవడం తో స్టైల్ రెట్టింపు అయింది. జాక్వెలిన్ వెనక భాగంలో ఎండ పడుతూ ఉండడం తో బంగారు వర్ణం లో శిరోజాలు మెరుస్తూ ఉన్నాయి. ఈ ఫోటోలో జాక్ ఓ ఆడ కొదమసింహం లాగా కనిపిస్తోంది.

ఇలాంటి జిల్ జిల్ ఫోటోలకు నెటిజన్లు థ్రిల్లైపోకుండా ఎలా ఉంటారు సూపర్ కామెంట్స్ పెట్టారు. “స్టన్నింగ్ బ్యూటీ”.. “హాలీవుడ్ హీరోయిన్”.. “బ్యూటిఫుల్ బ్యాడ్ గర్ల్” అంటూ కొందరు కామెంట్లు పెట్టారు. ఈ ఫోటోలకు సోఫీ చౌదరి లాంటి హాటు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా లైక్స్ కొట్టారు. సినిమాల విషయానికి వస్తే జాన్ అబ్రహం కొత్త హిందీ సినిమా ‘ఎటాక్’ లో నటిస్తోంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-