జక్కన్న ఈగని మించిన ఈ ‘తేనెటీగ’ .. ఏంచేస్తుందంటే ?!

0

‘ఈగ’ .. నాని హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బిగెస్ట్ సూపర్ హిట్ చిత్రం. అందులో పేరుకే నాని హీరో. కానీ సినిమా మొత్తం జక్కన్న చెక్కిన ఈగ చుట్టూనే నడుస్తుంది. ఆ ఈగ ని చుసిన ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి ఈగని మనం పెంచుకుంటే ఎంత బాగుంటుందో కదా అని ఎంతోమంది అనుకున్నారు. కానీ అది సాధ్యం కాదు. కానీ జక్కన్న ఈగని మించిన తేనెటీగ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో చక్కెర్లు కొడుతోంది. ఇన్ స్టాగ్రామ్లో ఇటీవల ఓ తేనెటీగ తెగ చక్కర్లు కొడుతోంది. రోజు రోజూ తన ఫాలోవర్లను పెంచుకుంటూ హాలీవుడ్ స్టార్లకే వణుకు తెప్పిస్తోంది.

ఇన్ స్టాగ్రామ్ .. ఈ మధ్య యూత్ బాగా వాడుతున్న సోషల్ మీడియా యాప్ . ప్రతి చిన్న విషయాన్ని కూడా అందులో షేర్ చేసి తమ ఆనందాన్ని నలుగురితో పంచుకుంటున్నారు. ఇన్ స్టాగ్రామ్లో మనుషులే కాకుండా జంతువులకు కూడా ప్రత్యేకంగా అకౌంట్లు ఉన్నాయి. వాటికి ఉండే ఫాలోయింగ్.. సినీ తారలకు కూడా ఉండదు. ఎప్పటికప్పుడు క్రియేటివ్ చిత్రాలు వీడియోలతో అలరిస్తూ.. ఫాలోవర్లను మెప్పిస్తున్నాయి. మనుషులకి నేను ఏ మాత్రం తగ్గేది లేదు అని భావించిన ఓ తేనెటీగ ఇన్ స్టాగ్రామ్ లో అకౌంట్ ఓపెన్ చేసి .. తన ఫాలోవర్లను రోజు రోజుకి విపరీతంగా పెంచుకుంటూ పోతుంది. నవ్వు తెప్పించే ఫొటోలతో ఎప్పటికప్పుడు మనసు దోచుకుంటూనే ఉంటుంది ఈ తేనెటీగ.

అలాగే ఈ తేనెటీగ ఫోటోలు చూస్తుంటే దీనికి ప్రపంచ పర్యటన చేయాలనే ఆశ కూడా ఎక్కువే అనిపిస్తుంది. ఏ ఫొటోలో చూసినా ఏదో ఒక పర్యాట ప్రాంతంలో సేద తీరుతూ సెల్ఫీలు తీసుకుంటూ కనిపిస్తుంది. అప్పడప్పుడు సూట్కేసులు పట్టుకుని కొన్నిసార్లు తలపై క్యాప్ పెట్టుకుని … దర్శనం ఇస్తుంటుంది. ఇన్ స్టాగ్రామ్లో ‘bee_Influencer’ పేరుతో ఏడు నెలల క్రితం కొంతమంది ఈ తేనెటీగ ప్రొఫైల్ను మొదలు పెట్టారు. ఈ అకౌంట్కు ఫాలోవర్లు పెరిగితే డబ్బులు వస్తాయని ఆ మొత్తాన్ని తేనెటీగలను పరిరక్షించేందుకు ఉపయోగిస్తామని ఆ తేనెటీగ సృష్టికర్తలు వెల్లడించారు. దీనితో ఆ అకౌంట్ కి ఫాలోవర్లు అనూహ్యంగా పెరిగారు. ఇప్పటివరకు ఆ అకౌంట్ కి 2.26 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
Please Read Disclaimer