అందాన్ని అలా కొలిస్తే బెల్లా హదీద్ టాప్!

0

మానవసమాజంలో విడదీయలేని భాగం తూనికలు కొలతలు.. ఈ పదం వినగానే మన ప్రభుత్వశాఖలలో ఒకటి గుర్తొస్తే ఆశ్చర్యమేమీ లేదు. ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. ఒక కొలత ఉంటుంది. అయితే అందం విషయం వచ్చేసరికి అలాంటి సూత్రాలేవీ వర్తించవు. అయితే ఫ్యాషన్ ప్రపంచంలో మాత్రం ఒక మనిషి మగైనా ఆడైనా అందానికి కొన్ని బేసిక్ పెరామీటర్స్ ఉంటాయి. అవి ఎత్తు.. బరువు.. కలర్. ముఖకవళికలు లాంటివి.

ఈ పాయింట్స్ లో కూడా చాలా డిబేట్ ఉంది. ఎందుకంటే చైనీయులు ఐదున్నర అడుగుల ఎత్తుంటే ఆజానుబాహులనే టాగ్ ఇచ్చేస్తారు. అదే ఆఫ్రికాలో అయితే కనీసం ఆరడుగులు ఉండాలి! ఇక కలర్ విషయంలో కూడా చాలా చర్చలు నడుస్తూనే ఉంటాయి. బరువు విషయంలో కూడా ఈ తికమక ఉంది. కొందరికి లడ్డూలా ఉండే ఇష్టం.. ఒక్దరికీ సన్నగా రివటలాగా జీరో సైజ్ లో ఉంటే ఇష్టం. అయితే గ్రీకువారు అందానికి మార్కులు వేసేందుకు ఒక పాత గణిత సూత్రాన్ని ఫాలో అవుతారు. అదే గోల్డెన్ రేషియో ఆఫ్ ఫై స్టాండర్డ్స్.

ఫేస్ కొలతలు తీసుకుని దాన్ని సైంటఫిక్ గా లెక్కలు వేసిమరీ అందాన్ని లెక్కగడతారు. ఈమధ్య ఇలా లెక్కలు వేసి అంతర్జాతీయ భామామణులకు రీసెంట్ గా ర్యాంకింగులు ఇచ్చారు. ఇందులో బెల్లా హదీద్ అనే 23 ఏళ్ళ మోడల్ 94.35% పర్ఫెక్ట్ గా నిలిచి మొదటి స్థానం సాధించింది. ఇక తర్వాత స్థానంలో ప్రముఖ అంతర్జాతీయ పాప్ సింగర్ బియోన్స్ నిలిచింది. ఆమె ఈ గోల్డెన్ రేషియో ప్రకారం 92.44% పర్ఫెక్ట్ అని తేల్చారు. ఇక మూడవ స్థానంలో నటి అంబర్ హర్డ్ (91.85%).. నాలుగవ స్థానంలో పాప్ స్టార్ అరియానా గ్రాండ్ (91.81%) నిలిచింది .

ఇక ఈ గణిత సూత్రం శారీరకమైన అందాన్ని కొలవగలదేమో కాని బుర్రలోపల ఉండే అందాన్ని.. అంటే అంతః సౌందర్యాన్ని చచ్చినా కొలవలేదు. అంతః సౌందర్యం అనగానే దయచేసి దిశా పటాని దగ్గరకు.. కాల్విన్ క్లెయిన్ల దగ్గరకు వెళ్ళకండి. ఇక మీ ఫేస్ గోల్డెన్ రేషియో తెలుసుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్ లో సవాలక్ష యాప్స్ ఉన్నాయి. తెలుసుకోండి. అయితే ఆ యాప్ కాస్తా కరప్ట్ అయ్యి.. హ్యంగ్ అయ్యేంత అందం మీకుంటే మాత్రం ఆ పిచ్చి యాపులపై కాస్త జాలి.. దయ చూపించండి. అప్పుడు మీకు కనీసం మానసిక సౌందర్యం అయినా ఉన్నట్టు లెక్క!
Please Read Disclaimer