ఇంతకీ సీత వస్తుందా రాదా ?

0

భారీ బడ్జెట్లు ఫుల్ ఫాంలో టాప్ హీరొయిన్లు ఉంటే తప్ప సినిమా చేయడనే పేరున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొత్త సినిమా సీత ఏప్రిల్ 25న విడుదల కావాలి. ముందుగా ఆ డేట్ ని లాక్ చేసుకున్న మహర్షి మేకి షిఫ్ట్ అయిపోవడంతో నిర్మాతలు ఆలస్యం చేయకుండా దీని మీద కర్చీఫ్ వేసేశారు. కాని నిజంగా ఆ సమయానికి సీత వస్తుందా అంటే డౌటే అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. దానికి కొన్ని కారణాలు చెబుతున్నారు.

సీతకు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా బాలన్స్ ఉందట. ఎంత లేదన్నా దానికి నెల దాకా సమయం పడుతుందని దర్శకుడు తేజ చెప్పడంతో టార్గెట్ చేసిన డేట్ అంత కన్నా తక్కువ వ్యవధిలో ఉండటంతో ఇప్పుడీ విషయంలో పునరాలోచనలో పడ్డట్టు తెలిసింది. చేతిలో నెల రోజులు కూడా లేకుండా ప్రమోషన్ చేసుకోవడం అంత ఈజీ కాదు

ఈ నేపధ్యంలో సీత వాయిదా పడేందుకే ఎక్కువ ఛాన్స్ ఉందని చెబుతున్నారు. పైగా ఎన్నికలు ఫలితాలు అంటూ వాతావరణం అంత అనుకూలంగా లేదు కాబట్టి కొత్త ప్రభుత్వాలు వచ్చాక రిలీజ్ చేసుకుందామనే ఆలోచన కూడా సాగుతున్నట్టు మరో న్యూస్. ఇందులో ఏది నిజమో కాదో చెప్పలేం కాని జరుగుతున్న పరిణామాలు మాత్రం వీటికి బలం చేకూరుస్తున్నాయి.

ఓ రెండు పోస్టర్లు తప్ప సీతకు సంబంధించి ఇంకే మెటీరియల్ బయటికి రాలేదు. అంటే ఏప్రిల్ 25 మీద సీత యూనిట్ సందిగ్ధంలో ఉన్న వార్త నిజమే అనిపిస్తుంది. ఏదో ఒకటి తేజనో సాయి శ్రీనివాసో క్లారిటీ ఇస్తే బెటర్. కవచం తర్వాత ఈ హీరోతో కాజల్ అగర్వాల్ నటిస్తున్న రెండో సినిమా ఇది.
Please Read Disclaimer