రంగంలోకి దిగబోతున్న బెల్లంకొండ అల్లుడు

0

ఈ నెల ఆరంభంలోనే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు షూటింగ్స్ కు అనుమతులు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఎప్పుడైతే షూటింగ్స్ కు ఓకే చెప్పిందో సీరియల్స్ వాళ్లు రంగంలోకి దిగారు. బుల్లి తెర సీరియల్స్ మరియు షోలకు పెద్దగా నటీనటులు మరియు భారీ ఎత్తున క్రూ అవసరం లేదు. కనుక వాటి షూటింగ్స్ ప్రారంభం అయ్యాయి. కాని సినిమాల షూటింగ్స్ మాత్రం ఆశించిన స్థాయిలో ప్రారంభం కాలేదు. వచ్చే నెల నుండి టాలీవుడ్ లో కూడా షూటింగ్స్ సందడి కనిపించే అవకాశం కనిపిస్తుంది.

టాలీవుడ్ కు చెందిన పలువురు యంగ్ హీరోలు వచ్చే నెలలో షూటింగ్ మొదలు పెట్టాలనే నిర్ణయానికి వచ్చారు. వైరస్ భయంతో ఇన్ని రోజులు షూటింగ్స్ కు సిద్దం అవ్వని నిర్మాణ సంస్థలు ఇప్పుడు మద్యలో ఆగిన తమ సినిమాలను మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాయి. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘అల్లుడు అదుర్స్’ చిత్రం షూటింగ్ ను వచ్చే నెలలో ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించారు.

జులై మొదటి వారంలో ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలను పాటిస్తూ షూటింగ్ కు వెళ్లబోతున్నట్లుగా యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. మొదట బెల్లంకొండ శ్రీనివాస్ ఇంకా కీలక నటీనటులపై చిత్రీకరణ జరుపనున్నారు. ఆ తర్వాత రెండు వారాలకు హీరోయిన్ నభా నటేష్ షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అల్లుడు అదుర్స్ చిత్రాన్ని ఈ ఏడాది విడుదల చేయాలని దర్శకుడు ప్లాన్ చేసుకోగా మహమ్మారి వైరస్ కారణంగా ప్లాన్ రివర్స్ అయ్యింది. వచ్చే ఏడాదిలో సినిమా విడుదలకు నోచుకునే అవకాశం ఉందని టాక్.
Please Read Disclaimer