‘ఫిట్నెస్’తో నెట్టింట హల్చల్ చేస్తున్న అల్లుడు శ్రీను!

0

టాలీవుడ్ ఇండస్ట్రీలో ‘అ‍ల్లుడు శ్రీను’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తన మొదటి సినిమాతోనే శ్రీను ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వరుసగా చాలా సినిమాలు చేసిన పెద్దగా బ్రేక్ రాలేదు. కానీ గతేడాది నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ‘రాక్షసుడు’. బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అందుకొని సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ప్రస్తుతం శ్రీనివాస్ కందిరీగ.. హైపర్ సినిమాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి ‘అల్లుడు అదుర్స్’ అనే టైటిల్ ఖరారు చేసింది చిత్రబృందం. ఇదిలా ఉండగా.. ఫిట్నెస్కి ప్రాధాన్యత ఇచ్చే టాలీవుడ్ హీరోలలో ముందుంటాడు ఈ బెల్లంకొండ హీరో. లాక్డౌన్ ప్రారంభం అయినప్పటి నుంచి సరైన డైట్ ఫాలో అవుతూ వర్కవుట్స్ చేస్తున్నాడట.

మరోవైపు ఈ కరోనా సెలవులను బాగానే ఎంజాయ్ చేస్తున్నాడట. అయితే శ్రీనివాస్ తాజాగా ఫొటోషూట్లో పాల్గొన్నాడు. తన బ్లాక్ రేంజ్ రోవర్ కారు ముందు స్టైలిష్గా.. నిలబడి బ్లాక్ అండ్ వైట్ కాస్ట్యూమ్స్లో కెమెరాకు పోజులిచ్చాడు. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇక ‘అల్లుడు అదుర్స్’తో ఈ హీరో మళ్లీ అ‍ల్లుడి సెంటిమెంట్ను నమ్ముకున్నట్లున్నాడు. అయితే మొదటి దానికి ఇది పూర్తిస్థాయి భిన్నంగా వినోదాత్మక ఉంటుందని అంటున్నాడు. ఈ సినిమాలో ఇస్మార్ట్ హీరోయిన్ నభా నటేష్ అనూ ఇమ్మాన్యుయేల్ హీరోతో జోడీ కట్టబోతున్నారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ పై జి.సుబ్రహ్మణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు.
Please Read Disclaimer