ఇస్మార్ట్ బెల్లకొండ శంకర్!

0

యువహీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న విజయం ఈమధ్య రీమేక్ సినిమా ‘రాక్షసుడు’ తో దక్కించుకున్నాడు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఫార్మాట్ స్టోరీలు చేసినప్పుడు దక్కని విజయం డిఫరెంట్ గా ఒక క్రైమ్ థ్రిల్లర్ లో నటించినప్పుడు దక్కడంతో శ్రీనివాస్ తన సినిమాల ఎంపికపై జాగ్రత్త వహించాలని నిర్ణయించుకున్నాడట. బెల్లంకొండ శ్రీనివాస్ నెక్స్ట్ సినిమా ను సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ సినిమా ఓ యాక్షన్ డ్రామా అని శ్రీనివాస్ కొత్తగా కనిపిస్తాడని సమాచారం..౦౦

అందుకే ఈ సినిమా కోసం గెటప్ పూర్తిగా మార్చాడు. గడ్డం పెంచి కొత్తగా కనిపిస్తున్నాడు. శ్రీనివాస్ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటోను పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ ఫోటోలో ఎయిట్ ప్యాక్స్ యాబ్స్ తో.. గడ్డం తో ఇష్టైలుగా కనిపిస్తున్నాడు. ఎప్పటిలాగా కాకుండా ఈ గెటప్ లో రగ్డ్ లుక్ లో ఉండడం విశేషం. శ్రీనివాస్ షర్టు.. నిలుచున్న స్టైల్ కూడా కిరాక్ అని చెప్పాలి.

బెల్లకొండ బాబు కొత్త గెటప్ నెటిజన్లు భలే నచ్చింది. లైకులతో కామెంట్ల తో జేజేలు తెలిపారు. ఇక శ్రీనివాస్ కొత్త సినిమా విషయానికి వస్తే డిసెంబర్ లో ప్రారంభం అవుతుందని సమాచారం. ‘రాక్షసుడు’ తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన శ్రీనివాస్ ఈ సినిమా తో మరో హిట్ సాధించి టాలీవుడ్ లో మరో మెట్టు ఎక్కుతాడేమో వేచి చూడాలి.
Please Read Disclaimer