‘మహా సముద్రం’ ఇంట్రెస్టింగ్ అప్ డేట్

0

‘ఆర్ ఎక్స్ 100’ చిత్రంతో దర్శకుడు అజయ్ భూపతి ఒక్కసారిగా వాంటెడ్ హీరోగా మారిపోయాడు. ఈయన దర్శకత్వంలో నటించేందుకు యంగ్ హీరోలు క్యూ కట్టారు. అయితే ఈయన మాత్రం బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఒక చిత్రం చేసేందుకు సిద్దం అయ్యాడు. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ‘మహా సముద్రం’ అనే టైటిల్ ను కూడా ఖరారు చేసిన విషయం తెల్సిందే. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్న ‘మహాసముద్రం’ చిత్రంలో బెల్లంకొండ హీరో మాత్రమే కాకుండా మరో హీరోగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది.

మాఫియా నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందనే టాక్ సినీ వర్గాల్లో వినిపిస్తుంది. రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అయిన అజయ్ భూపతి మొదటి చిత్రంతో రొమాంటిక్ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించాడు. రెండవ సినిమాను మాఫియా నేపథ్యంలో రూపొందించేందుకు సిద్దం అయ్యాడు. ఈ చిత్రం కథ రీత్యా మరో ముఖ్య పాత్రకు గాను మరో హీరో అవసరం ఉందట. త్వరలోనే ఆ హీరో ఎంపిక జరుగబోతుంది.

బెల్లంకొండతో పాటు ఆయనకు సమానమైన హీరో ఈ చిత్రంలో ఉంటాడా లేదంటే ఆయన స్థాయిని మించిన హీరో ఉంటాడా అనేది చూడాలి. ప్రస్తుతం మల్టీస్టారర్ సినిమాల సందడి కొనసాగుతున్న నేపథ్యంలో మరో హీరోను ఈ చిత్రంలో నటింపజేసి మల్టీస్టారర్ గా ‘మహా సముద్రం’ చిత్రాన్ని తీసుకు రావాలని అజయ్ భూపతి ప్రయత్నాలు చేస్తున్నాడు. త్వరలోనే ఈ విషయమై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Please Read Disclaimer