బెల్లంకొండ బాబుకు డైరెక్టర్ ఫిక్స్

0

యువహీరో బెల్లకొండ నిరీక్షణ ఫలించి ‘రాక్షసుడు’ తో తొలి హిట్ అందుకున్నాడు. ఫస్ట్ సినిమాతోనే ప్రేక్షకులలో గుర్తింపు తెచ్చుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి నుంచి భారీ బడ్జెట్ కమర్షియల్ ఎంటర్టైనర్లు చేస్తూ వచ్చాడు. అయితే ‘సీత’ తో మొదటిసారి ప్రయోగాల బాట పట్టాడు. తర్వాత ‘రాక్షసుడు’ కూడా ఒక ఎక్స్ పరిమెంట్ అనే చెప్పాలి. ‘సీత’ ప్రయోగం మంచి ఫలితాన్నివ్వలేదు కానీ ‘రాక్షసుడు’ మాత్రం బెల్లంకొండ బాబుకు సక్సెస్ ను అందించింది.

‘రాక్షసుడు’ తర్వాత శ్రీనివాస్ నటించబోయే సినిమా ఇప్పుడు ఫైనలైజ్ అయింది. ‘కందిరీగ’ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ గా బెల్లంకొండ శ్రీనివాస్ చేసే కమర్షియల్ ఎంటర్టైనర్ తరహాలోనే ఉంటుందని సమాచారం. ‘రాక్షసుడు’ తర్వాత ఒక మాస్ సినిమా చేయాలనే ఆలోచనతో కథ కోసం ఎదురు చూస్తూ ఉంటే సంతోష్ శ్రీనివాస్ ఒక ఇంట్రెస్టింగ్ కథతో మెప్పించాడట. దీంతో బెల్లంకొండ శ్రీనివాస్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

ప్రస్తుతం ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ జోరుగా సాగుతోందని.. త్వరలోనే ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. సంతోష్ శ్రీనివాస్ లాస్ట్ సినిమా రామ్ హీరోగా తెరకెక్కిన ‘హైపర్’.. ఆ సినిమా 2016 లో రిలీజ్ అయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో ‘తెరి’ రీమేక్ ఉంటుందని వార్తలు వచ్చాయి కానీ అది కుదరలేదు. ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు.