బెల్లం హీరో అసలు రహస్యం అదన్నమాట

0

ఇండస్ట్రీలో సక్సెస్ తప్ప ఇంకేది ప్రామాణికంగా నిలవలేని పరిస్థితుల్లో అది ఇంకా పలకరించకపోయినా క్రేజీ ప్రాజెక్ట్స్ ని తన ఖాతాలో వేసుకుంటున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సీత రూపంలో త్వరలోనే పలకరించబోతున్నాడు. ఏప్రిల్ 25 విడుదల అన్నారు కాని దానికి సంబంధించి మరోసారి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఇదిలా ఉంటే మొదటి సినిమా అల్లుడు శీను మొదలుకుని మొన్నోచ్చిన కవచం దాకా శీను అందరూ స్టార్ హీరొయిన్లతోనే ఆడిపాడాడు. ఒక్క స్పీడున్నోడు మాత్రం దీనికి మినహాయింపు. ఐటెం సాంగ్స్ కి సైతం తమన్నా లాంటి వాళ్ళను తీసుకొచ్చిన ఘనతను సొంతం చేసుకున్నాడు. అందుకే సోషల్ మీడియాలో ఈ హీరో మీద రకరకాల మేమ్స్ వైరల్ అవుతుంటాయి. అవన్నీ సరదాగా ఉంటాయి కాబట్టి పెద్దగా పట్టించుకోనవసరమూ లేదు

ఇది తన దృష్టిలో లేదని కాదు కాని ఇన్నేళ్ళ తర్వాత బెల్లంకొండ హీరో దీని గురించి స్పందించాడు. పరిశ్రమకు కొత్తగా వచ్చిన తనకు ఓపెనింగ్స్ తో పాటు హైప్ రావాలి అంటే కమర్షియల్ అంశాలతో పాటు టాప్ అండ్ హాట్ హీరొయిన్స్ ఉండాలని అందుకే బడ్జెట్ గురించి ఆలోచించకుండా వాళ్లనే తీసుకునేందుకు ప్రాధాన్యత ఇవ్వాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చాడు.

ఒక స్టేజికు వచ్చి ప్రూవ్ చేసుకున్నాక ఇక ఇలాంటి హంగులు అవసరం లేదని సాయి శ్రీనివాస్ వెర్షన్ కాబోలు. ఏదైతేనేం కొత్త హీరోలలో ఎవరికి పట్టని అదృష్టం ఇతనిదే. సమంతాతో మొదలుకుని రకుల్ కాజల్ దాకా అందరితో ఆడిపాడేశాడు. ఆ సక్సెస్ ఒక్కటీ పలకరిస్తే ఓ పనైపోతుంది. సీత మీద సాయి శ్రీనివాస్ మాములు కాన్ఫిడెంట్ గా లేడు.
Please Read Disclaimer