తండ్రి కల నెరవేర్చిన తనయుడికి హ్యాట్సాఫ్

0

“నాన్నకు `సైరా` అనే ఒక విజువల్ వండర్ ని కానుకగా ఇవ్వాలనేది మా అమ్మ(శ్రీమతి సురేఖ చిరంజీవి) నాతో అన్నారు. ఆ మాట కోసమే ఈ సినిమా తీస్తున్నాను. నాన్నకు ఇది అమ్మ ఇచ్చే కానుక!“ అని ప్రసాద్ ల్యాబ్ ఈవెంట్లో తొలి టీజర్ రిలీజైనప్పుడు రామ్ చరణ్ అన్నారు. ఇప్పుడు ఆ మాట నిలబెట్టుకుంటూ సైరా-నరసింహారెడ్డి అనే విజువల్ వండర్ ని కానుకగా ఇచ్చేందుకు చరణ్ ఎంతగా తపించారో టీజర్ క్లియర్ కట్ గా చెప్పింది. మొన్న రిలీజైన మేకింగ్ వీడియోతోనే `సైరా` చిత్రాన్ని కొణిదెల వారసుడు ఎంత పంతం పట్టి తెరకెక్కిస్తున్నాడో అర్థమైంది.

హీరో కం నిర్మాత రామ్ చరణ్ పనితనం సమర్థత గురించి .. తండ్రిపై అతడి అవిభాజ్య ప్రేమ గురించి `సైరా` చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించిన కన్నడ స్టార్ సుదీప్ తన ప్రసంగంలో చెప్పారు. నేడు ముంబైలో `సైరా` టీజర్ ఈవెంట్లో సుదీప్ మాట్లాడుతూ తండ్రి కలను.. ఆశయాన్ని నెరవేర్చిన గొప్ప తనయుడు రామ్ చరణ్! అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఒక హీరో అయ్యుండి రామ్ చరణ్ తన కలను పక్కన పెట్టి తండ్రి కలను నెరవేరుస్తున్నారు. నిర్మాతగానూ ఎంతో ప్యాషన్ తో ఈ సినిమా తీశారు. తండ్రి ఆశయాల్ని నెరవేర్చిన అలాంటి ఒక కొడుకు ఉండడం ఆయన అదృష్టం అని అన్నారు.

“ఈ సంవత్సరం వరుసగా మెగాస్టార్లతో పని చేస్తున్నారు. దాంతో పాటు `దబాంగ్ 3`లోనూ నటిస్తున్నారు. ఈ సంవత్సరం మీకు సూపర్ స్టార్ ఇయర్ లా ఉందనిపిస్తోందా?“ అని ముంబై జర్నలిస్టు ప్రశ్నిస్తే.. దానికి సుజీత్ స్పందిస్తూ “మీ ప్రశ్నలోనే జవాబు ఉంది. ఇలాంటి గొప్ప వాళ్ల సినిమాల్లో నటించే అవకాశం రావడం అంటే అదృష్టం ఉండాలి“ అని అన్నారు. “ఇలాంటి గొప్ప సినిమాలే మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తాయి. ఇలాంటివి చేసేప్పుడు అంత గొప్పవాళ్లతో పరిచయాలు ఏర్పడడం గొప్ప అనుభూతినిస్తుంది. ఆన్ లొకేషన్ ఉపయోగించిన ప్రాపర్టీస్ కి తగ్గట్టే `సైరా` చిత్రంలో అంతమంది నటీనటులు కనిపిస్తారు. హైదరాబాద్ లో వేసిన సెట్స్ కి వెళ్లేప్పుడు నిరంతరం ట్రాఫిక్ ని ఎదుర్కోవాల్సి వచ్చేది. ఆ ట్రాఫిక్ జనాల రద్దీని.. దాటుకుని ఆ తర్వాత కోట గేట్ లోంచి లోనికి వెళుతుంటేనే ఏదో గమ్మత్తుగా అనిపించేది. నేను ఎలాంటి అసాధారణ చిత్రంలో నటిస్తున్నానో అనిపించేది. నిర్మాత కం హీరో రామ్ చరణ్ ఈ సినిమా తీస్తున్నారు. తండ్రి కల నెరవేర్చిన తనయుడిగా అతడి గొప్పతనాన్ని చూస్తున్నా. హీరో అంటే ఎవరికి వారికి సొంతంగా ఒక ప్లాట్ ఫామ్ ఉంటుంది. దానిని సాధించుకున్న తర్వాత కూడా ఇలా నిర్మాతగా పని చేయడం గొప్ప విషయం. ఇతర స్టార్లకు నా అవసరం ఉందనుకుని చరణ్ ఈ సినిమా చేస్తున్నారు. తన డ్రీమ్ ని సైతం లెక్క చేయకుండా తన తండ్రి కలను నెరవేర్చాలనే ఆశయంతో సైరా చిత్రం తీవారు చరణ్“ అంటూ ప్రశంసలు కురిపించారు.
Please Read Disclaimer