క్రేజీ హీరోయిన్ తనయుడు హీరోగా ఎంట్రీ

0

సల్మాన్ కెరీర్ ఆరంభంలో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం ‘మైనే ప్యార్ కియా’. ఆ చిత్రంలో హీరోయిన్ గా నటించిన భాగ్యశ్రీ ఓవర్ నైట్ లో స్టార్ అయ్యింది. ఆ చిత్రం తర్వాత కొంత కాలం సినీ కెరీర్ కొనసాగించిన భాగ్యశ్రీ ఆ తర్వాత పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో అడుగు పెట్టింది. సినిమాలకు పూర్తిగా దూరం అయిన భాగ్యశ్రీ మళ్లీ ఇన్నాళ్లకు తన కొడుకును సినిమాల్లోకి తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది.

ఇండస్ట్రీలో ఎక్కువ శాతం హీరోల వారసులు హీరోలుగా పరిచయం అవ్వడం జరుగుతుంది. చాలా అరుదుగా ఇలా హీరోయిన్స్ తమ వారసులను తీసుకు వస్తూ ఉంటారు. తాజాగా భాగ్యశ్రీ తన కొడుకు అభిమన్యు దాసానిని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అయ్యింది. అభిమన్యు హీరోగా ఇప్పటికే ‘నిక్కమ్మా’ అనే చిత్రం ప్రారంభం అయ్యింది. సబీర్ ఖాన్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ సోనీ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇక అభిమన్యుకు జోడీగా ఈ చిత్రంలో సింగర్ షిర్లే సేటియా నటిస్తోంది.

తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. భాగ్యశ్రీ తనయుడు అవ్వడంతో ఈతరం ప్రేక్షకులకు వెంటనే నోటెడ్ అవ్వకున్నా.. కాస్త ఏజ్ ఎక్కువ ఉన్న వారికి వెంటనే కనెక్ట్ అయ్యాడు. భాగ్యశ్రీ తనయుడు అంటూ అప్పుడే అభిమన్యుపై అభిమానం పెంచుకుంటున్నారు. ఫస్ట్ లుక్ లో అభిమన్యు ఆకట్టుకున్నాడు. 22 ఏళ్ల అభిమన్యు ఒక పక్కా కమర్షియల్ హీరోలా ఉన్నాడంటూ కామెంట్స్ వస్తున్నాయి.
Please Read Disclaimer