30 ఏళ్ళు దాటిన భానుమతి – రామకృష్ణ లవ్ స్టోరీ ఇది…!

0

‘అందాలరాక్షసి’ ఫేమ్ నవీన్ చంద్ర – సలోని లుథ్రా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘భానుమతి రామకృష్ణ’. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని ‘ఆహా’ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో కృశివ్ ప్రొడక్షన్స్ మరియు హ్యాండ్ పిక్డ్ స్టోరీస్ బ్యానర్లపై యశ్వంత్ ములుకుట్ల నిర్మించారు. ఇక అచ్చు నేపథ్య సంగీతం అందించగా శ్రావణ్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు. రాజా చెంబోలు హర్ష ఇతర పాత్రలు పోషించారు. రీసెంటుగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. సిటీలోని అమ్మాయి.. పల్లెటూరి నుండి సిటీకి వచ్చిన పెళ్లీడు దాటిపోయిన అబ్బాయి మధ్య ప్రేమ ఎలా పుట్టిందనే కథాంశంతో ఈ మూవీ రూపొందిందని అర్థం అవుతోంది.

ఇప్పుడు లేటెస్టుగా ఈ సినిమాకి సంభందించి ‘లవ్ ఇన్ థర్టీస్’ పేరుతో టీజర్ రిలీజ్ చేసింది ‘ఆహా’ టీమ్. ”దీని పేరు భానుమతి. అప్పుడెప్పుడో ‘సీతాకోక చిలుక’ సెకండ్ రిలీజ్ అప్పుడు పుట్టింది. దీంతో పాటు చదువుకున్న అబ్బాయిలందరికీ పెళ్లిళ్లు అయిపోయాయి. అమ్మాయిలందరికి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్స్ కూడా అయిపోయాయి. ఇది మాత్రం ఏదో కుస్తీ పోటీలకు వెళ్లేదానిలా కసరత్తులు చేస్తూ ఉంటుంది…” అంటూ హర్ష వాయిస్ ఓవర్ తో సాగిన ఈ టీజర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ చిత్ర కథ 30 ఏళ్ళు దాటిన ఓ యువతీ యువకుల మధ్య ప్రేమ వ్యవహారాన్ని హృద్యంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. జూలై 3న తెలుగు డిజిటల్ ప్లాట్ ఫార్మ్ ‘ఆహా’ ఓటీటీలో రిలీజ్ కానున్న ‘భానుమతి రామకృష్ణ’ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి.
Please Read Disclaimer