ఫస్ట్ డే ‘భరత్ ‘ టార్గెట్ ఎంత..?

0ఇప్పుడు ఎక్కడ చూసిన భరత్ అనే నేను చిత్రం గురించే మాట్లాడుకుంటున్నారు. మహేష్ – కొరటాల శివ కలయికలో రాబోతున్న ఈ మూవీ సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క చిత్ర యూనిట్ సైతం గతంలో మహేష్ కెరియర్ లో ఎన్నడూ లేని విధంగా సినిమాను రిలీజ్ చేస్తున్నారు. కేవలం అమెరికా లో 2000 స్క్రీన్లలో ప్రీమియర్ షోలు పడుతుండడంతో, భారీ రికార్డులను ‘భరత్ అనే నేను’ కొల్లగొడుతోందన్న టాక్ ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

ముఖ్యంగా ‘శ్రీమంతుడు’ పేరిట ఉన్న రికార్డులను తాజాగా రామ్ చరణ్ ‘రంగస్థలం’ తో బద్దలు కొట్టడం తో , మరోసారి ప్రిన్స్ ప్రభంజనం చూపించాల్సిన సమయం వచ్చింది. సినిమాకు మంచి టాక్ వస్తే రంగస్థలం కలెక్షన్లను తిరగరాయడం పెద్ద విషయం కాదని అంటున్నారు. ఎందుకంటే మహేష్ కు యూఎస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ప్లాప్ చిత్రాలు సైతం మంచి కలెక్షన్లు రాబట్టిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది హిట్ టాక్ వస్తే కలెక్షన్లను ఆపడం ఎవరి తరం కాదని సినీ వర్గాలు అంటున్నారు.. మరి భరత్ ఫస్ట్ డే ఎంత టార్గెట్ అనేది చూడాలి.