వరల్డ్ రికార్డు కొట్టిన మహేష్..

0సూపర్ స్టార్ మహేష్ బాబు ఖాతాలో మరో రికార్డు చేరింది. ప్రస్తుతం మహేష్ కొరటాల శివ దర్శకత్వం లో భరత్ అనే నేను మూవీ చేస్తున్న సంగతి తెల్సిందే. బాలీవుడ్ భామ కైరా అడ్వాణీ ఈ మూవీ లో మహేష్ కు జోడిగా నటిస్తుంది. ఇటీవల ‘భరత్’‌ విజన్‌ పేరిట విడుదలైన టీజర్‌కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

టాలీవుడ్‌లోనే అత్యధిక లైక్స్‌ సాధించిన టీజర్‌గా రికార్డు నెలకొల్పగా , తాజాగా మరో రికార్డు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది లైక్‌ చేసిన టీజర్లలో రెండో స్థానంలో ఈ టీజర్ నిలిచింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా తెలిపారు. ఇప్పటివరకూ ఈ చిత్ర టీజర్‌ను 6,40,000 మంది లైక్‌ చేశారు. ఈ సందర్భంగా ‘BAN 2nd most liked teaser in world’ హ్యాష్‌ట్యాగ్‌తో ట్రెండ్‌ అవుతోంది.

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏప్రిల్‌20న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.