భరత్ .. లెక్కలు మాములుగా లేవు

0శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్-కొరటాల కాంబోలో వస్తున్న సినిమా భరత్ అనే నేను. ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు. కైరా అద్వాని ఇందులో హీరోయిన్.

ఈ సినిమా కలెక్షన్స్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్ షోలను ఫిబ్రవరి 19న ప్రదర్శించనున్నారు. మొత్తం 2000 ప్రీమియర్‌ షోలను నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అమెరికా బాక్సాఫీసు వద్ద సినిమా సునామీ సృష్టించబోతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

అమెరికాలో మొత్తం 320కిపైగా లొకేషన్లలో సినిమాను ప్రదర్శించనున్నారట. తొలి వారాంతానికి మొత్తం 10 వేల షోలను ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.