మహేష్ తీరుపై ఫ్యాన్స్ విస్మయం

0

సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ లోనే టాప్ స్టార్ హీరోల్లో ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి మహేష్ బాబుతో స్టార్ దర్శకులు.. సీనియర్ దర్శకులు ఎంతో మంది సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. కథు పట్టుకుని ఆయన వెంట పడుతున్నారు. కాని ఆయన మాత్రం కొత్త దర్శకులపై ఆసక్తి చూపించడం అందరికి ఆశ్చర్యంగా ఉంది. తాజాగా సరిలేరు నీకెవ్వరు చిత్రంతో అనీల్ రావిపూడికి ఛాన్స్ ఇచ్చిన మహేష్ బాబు మళ్లీ అదే దారిలో నడిచే అవకాశం కనిపిస్తుంది.

సరిలేరు నీకెవ్వరు చిత్రం తర్వాత వంశీ పైడిపల్లితో సినిమా అనుకున్నా కూడా ఏదో కారణం వల్ల అది వాయిదా వేశారు. దాంతో 27వ చిత్రం దర్శకుడి కోసం మహేష్ అన్వేషణ సాగుతున్నట్లుగా తెలుస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ సినిమా ఉంటుందని ప్రచారం జరిగింది. స్క్రిప్ట్ చర్చలు జరుగుతున్నాయనే వార్తలు వచ్చాయి. ఈ సమయం లోనే మహేష్ బాబు నుండి భీష్మ చిత్ర దర్శకుడు వెంకీ కుడుములకు కాల్ వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.

ఛలో.. భీష్మ రెండు చిత్రాలను తెరకెక్కించిన వెంకీ కుడుమల వంటి చిన్న దర్శకుడితో సినిమా చేసేందుకు మహేష్ బాబు ఆసక్తి చూపించడం సినీ వర్గాల వారికి మాత్రమే కాకుండా ఫ్యాన్స్ కు కూడా విస్మయాన్ని కలిగిస్తుంది. ఎంతో మంది స్టార్ డైరెక్టర్స్ ఉంటే ఎందుకు మహేష్ బాబు ఇలా చిన్న దర్శకుల వైపు చూస్తున్నాడు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

వెంకీ కుడుములకు మహేష్ బాబును ఢీల్ చేసేంత సత్తా ఉందా అంటూ కొందరు అనుమానం వ్యక్తం చేస్తుంటే మరికొందరు మాత్రం ఛలో.. భీష్మ వంటి ఎంటర్ టైనర్ చిత్రాన్ని మహేష్ తో చేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే వెంకీకి ఛాన్స్ ఇస్తాడా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-