భీష్మ: ఓ వైపు చితక్కొట్టుడు.. మరోవైపు రోమియో వేషం!

0

రౌడీల్ని ఎగరేసి కొడతాడు.. అమ్మాయి వెంట రోమియోలా పడతాడు..
ఓ వైపు సై ఆట.. ఇంకోవైపు రోమియో వేషాలు.. ఏమిటి ఈ భీష్మ సంగతి..

ఓవైపు క్లాస్ గా సూటు బూటు వేసుకుని పోకిరీ వేషాల రోమియోలా మ్యాడమ్ వెంట పడుతున్నాడు.. మరోవైపు క్లాస్ గా సాఫ్ట్ వేర్ ఉద్యోగిలా టిప్ టాప్ గా రెడీ అయ్యి ఊర మాస్ రౌడీల్ని చితక్కొడుతున్నాడు.. అసలింతకీ భీష్మ క్యారెక్టర్ ఏమై ఉంటుంది? ఏమో ఇప్పటికైతే సస్పెన్స్. నితిన్ ని భీష్మగా చూపిస్తున్న వెంకీ కుడుములనే అడగాలి.

అన్నట్టు భీష్మ.. సింగిల్ ఫర్ ఎవ్వర్ అంటూ కలరింగ్ ఇచ్చారు కదా! మరీ అలా రోమియో వేషాలు వేస్తూ ఎప్పటికీ ప్రేమలో పడకుండా సింగిల్ గానే ఉంటాడని భావించాలా? ఇదేదో తేడా వ్యవహారంలానే ఉందేమిటో! ఏదో లాజిక్ ఇంకేదో మ్యాజిక్ లేకపోతే కొందరు బ్యాచిలర్ భీష్ములు ఎప్పటికీ అలానే ఎందుకు ఉండిపోతారు లెండి! ఇక రష్మిక పాత్రను పరిశీలిస్తే.. గీత పాత్రకు ఎక్స్ టెన్షన్ లానే కనిపిస్తోంది ఆ బిల్డప్పు. చారెడేసి కళ్లు.. బుంగమూతితో ఛలో మార్కులోనే కనిపిస్తోంది రష్మిక. మరీ అంత బిల్డప్పు ఉన్న మ్యాడమ్ వెంట పడుతున్నాడు భీష్మ. కాస్త జాగ్రత్తగానే హ్యాండిల్ చేయాల్సి ఉంటుందేమో!

దీపావళి కానుకగా రిలీజ్ చేసిన భీష్మ పోస్టర్లు నితిన్ ఫ్యాన్స్ కి స్పెషల్ ట్రీట్ అనే చెప్పాలి. ఛలో లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని తెరకెక్కించిన వెంకీ కుడుముల నితిన్ కి అదిరిపోయే హిట్టిస్తాడనే భావిస్తున్నారు. అలాగే ఛలో ఫేం రష్మికకు అద్భుతమైన పాత్రనే డిజైన్ చేశాడని పోస్టర్ చెబుతోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కి రానుంది. మునుముందు టీజర్లు.. ట్రైలర్లతో మ్యాటరెంతో ముందే గెస్ చేయొచ్చు.
Please Read Disclaimer