రొమాంటిక్ ‘భీష్మ’ ఇప్పుడు ఎక్కడున్నాడు?

0

శ్రీనివాస కళ్యాణం చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యంగ్ హీరో నితిన్ వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసందే. ఛలో చిత్రంతో సక్సెస్ ను దక్కించుకున్న దర్శకుడు వెంకీ కుడుముల అదే తరహా రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా భీష్మను తెరకెక్కిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ రొమాంటిక్ గా ఉండటంతో సినిమాపై యూత్ ఆడియన్స్ లో ఆసక్తి మొదలైంది.

నితిన్ కు జోడీగా ఈ చిత్రంలో రష్మిక నటించడం సినిమాకు ప్రధాన ఆకర్షణ. వీరిద్దరి మద్య కెమిస్ట్రీ ఏ విధంగా ఉండబోతుందో టీజర్ లోనే చెప్పకనే చెప్పారు. చాలా రొమాంటిక్ గా ఈ చిత్రంలోని సీన్స్ ఉంటాయని చిత్ర యూనిట్ సభ్యులు అనఫిషియల్ గా చెబుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ చిత్రంకు సంబంధించిన ఒక రొమాంటిక్ పాటను రోమ్ లో చిత్రీకరిస్తున్నారట. పాట చిత్రీకరణ కోసం రోమ్ వెళ్లినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు తెలియజేశారు.

సాగర్ మహతి ట్యూన్ చేసిన రొమాంటిక్ నెంబర్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందిస్తున్నాడు. శేఖర్ మాస్టర్ ప్రస్తుతం నితిన్ మరియు రష్మికలతో స్టెప్స్ వేయిస్తున్నాడు. వారం రోజుల పాటు చిత్రీకరణ జరుపనున్నారట. ఆ తర్వాత మరో రెండు మూడు వారాలు షూటింగ్ చేసి జనవరి రెండవ వారంకు షూటింగ్ ను పూర్తి చేయాలని నిర్ణయించకున్నారు. ఫిబ్రవరి మూడవ వారంలో సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
Please Read Disclaimer